|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mollywood: మంచి నిర్ణయం.. ఎంతమంది పాటిస్తారో చూడాలి?

Published: 21-06-2025, 4:13 AM

మలయాళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కల్చర్‌కు చెక్ పెట్టేందుకు కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు. షూటింగ్ సమయంలో డ్రగ్స్ ఉపయోగించరని అఫిడవిట్‌పై సంతకం చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో చూడాలి.

Key Points

1

మలయాళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కఠిన నిర్ణయం.

2

షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకోకూడదని అఫిడవిట్‌పై సంతకం తప్పనిసరి.

4

అమ్మ అసోసియేషన్ సమావేశంలో ఈ నిర్ణయంపై చర్చ జరగనుంది.

డ్రగ్స్ వినియోగం పెరుగుదల

మలయాళ చిత్రసీమలో డ్రగ్ కల్చర్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. షూటింగ్ లొకేషన్స్‌లోనే పలువురు నటులు మత్తు పదార్థాలు తీసుకోవడంతో పాటు తోటి నటీనటుల్ని ఇబ్బంది పెట్టడం లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం ఓ మూవీ సెట్‌లో తోటి నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ అలోషియస్‌ ఆరోపణ చేసింది. మరోవైపు డ్రగ్స్ ఆరోపణలతో షైన్‌ టామ్‌ చాకో సహా పలువురు నటుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

కొత్త నియమాలు అమలు

దీంతో ప్రస్తుత పరిస్థితుల్ని మార్చేందుకు మాలీవుడ్ పెద్దలు ముందుకొచ్చారు. ఇకపై సినిమాలు చేయాలంటే షూటింగ్ టైంలో డ్రగ్స్ తీసుకోం అని రాసున్న అఫిడవిట్‌లో సంతకం చేయాలని తీర్మానించారు. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నటీనటులు ఎవరైనా సరే ప్రాజెక్ట్ ఒప్పుకొనేటప్పుడు తప్పకుండా ఈ అఫిడవిట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడే సెట్‌లో అడుగుపెట్టనిస్తారు. సూపర్ స్టార్స్ నుంచి చిన్నస్థాయి టెక్నీషియన్స్ వరకు ఈ రూల్ వర్తిస్తుంది. అలానే నటీనటుల సిబ్బంది కూడా ఇది కచ్చితంగా పాటించాలి.

షూటింగ్‌ లొకేషన్స్‌తోపాటు నిర్మాణాంతర పనులు జరిగే ప్రదేశాల్లోనూ ఇది వర్తిస్తుందని కేరళ చిత్రసీమ చెప్పుకొచ్చింది. నిర్మాతల అసోసియేషన్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని డిపార్ట్‌మెంట్స్ నుంచి ఆమోదం వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం ‘అమ్మ’ (మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీని గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈనెల 26 నుంచే ఈ రూల్ అమల్లోకి రానుంది. చూడాలి మరి ఎంతమంది పాటిస్తారో?

అమ్మ అసోసియేషన్ సమావేశం

మలయాళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి. అందరూ నియమాలను పాటిస్తారా అనేది కీలక ప్రశ్న.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.