|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

థ్రిల్లర్ మూవీ ప్రియులకు పర్ఫెక్ట్ బొమ్మ ‘మార్గన్’..ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్, ఐబొమ్మలో ట్రెండింగ్

Published: 28-07-2025, 9:18 AM
థ్రిల్లర్ మూవీ ప్రియులకు పర్ఫెక్ట్ బొమ్మ 'మార్గన్'..ఓటీటీలో క్రేజీ రెస్పాన్స్, ఐబొమ్మలో ట్రెండింగ్

విజయ్ ఆంటోని నటించిన ‘మార్గన్’ సినిమా ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. సీరియల్ కిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఐబొమ్మలో కూడా ట్రెండింగ్ లో ఉంది.

Key Points

1

విజయ్ ఆంటోని నటించిన 'మార్గన్' థ్రిల్లర్ సినిమా ఓటీటీలో విడుదలైంది.

2

సీరియల్ కిల్లర్ కథాంశంతో ఆకట్టుకుంటోంది.

4

అజయ్ దిశాన్ పాత్ర ఈ చిత్రంలో హైలెట్.

‘మార్గన్’ కథాంశం ఏమిటి?

హీరో విజయ్ ఆంటోని థ్రిల్లర్ చిత్రాలకు బ్రాండ్ గా మారిపోయారు. విజయ్ ఆంటోని ఇటీవల నటించిన మార్గన్ చిత్రం థియేటర్లలో పర్వాలేదనిపించింది. సీరియల్ కిల్లర్ కథాంశంతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ మూవీలో విజయ్ ఆంటోనీతో పాటు అజయ్ దిశాన్, సముద్రఖని, బ్రిగడ సాగా కీలక పాత్రలో నటించారు.

ఈ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలైంది. జూలై 25 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే మార్గన్ చిత్రానికి ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ ఓటీటీలో విడుదలైందో లేదో వెంటనే పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ లో కూడా లీకై ట్రెండింగ్ గా మారింది.

ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉంది?

ఇంతకీ ఈ చిత్ర కథాంశం ఏంటో ఇప్పుడు చూద్దాం. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో అడిషనల్ డీజీపీ పోలీస్ అధికారిగా నటించారు ముంబైలో అతడు అడిషనల్ డీజీపీ గా పని చేస్తుంటాడు. హైదరాబాద్ లో ఓ యువతి దారుణంగా హత్యకు గురై కాలిపోయిన శరీరంతో చెత్త కుప్పలో కనిపిస్తుంది. సంచలనం సృష్టించిన ఈ కేసు గురించి విజయ్ ఆంటోనీకి తెలుస్తుంది. తాను ముంబైలో ఉన్నప్పటికీ హైదరాబాద్ వెళ్లి ఎలాగైనా ఈ కేసుని ఛేదించాలని విజయ్ ఆంటోనీ అనుకుంటారు.

ఈ కేసుని విజయ్ ఆంటోని అంత సీరియస్ గా తీసుకోవడానికి కారణం అతడి జీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగి ఉంటుంది. అనధికారికంగా విజయ్ ఆంటోని ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో అజయ్ దిశాన్ విజయ్ అంటోనీకి అనుమానకరంగా కనిపిస్తాడు. దీంతో అతనిని అదుపులోకి తీసుకొని విచారించడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో అజయ్ దిశాన్ గురించి ఊహకందని విషయాలు విజయ్ ఆంటోనికి తెలుస్తాయి. కానీ కొంత సమయానికే అతడు నిర్దోషి అని విజయ్ అంటోనీకి అర్థం అవుతుంది. కానీ అజయ్ దిశాన్ ఈ కేసులో అత్యంత కీలకంగా మారుతాడు.

ఐబొమ్మలో ట్రెండింగ్ ఎందుకు?

నేరం చేయనప్పటికీ చేయనప్పటికీ అజయ్ దిశాన్ ఈ కేసులో ఎందుకు కీలకమయ్యాడు. వరుసగా యువతుల హత్యలు చేస్తున్నది ఎవరు.. ఈ కేసుని విజయ్ ఆంటోని ఎలా చేదించారు? ఇలాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ చిత్రంలో అజయ్ దిశాన్ పాత్ర హైలెట్ అని చెప్పాలి. అతడికున్న మెమరీ పవర్, నీటిలో ఎక్కువసేపు ఊపిరి తీసుకోకుండా ఉండగలిగే శక్తి లాంటి అంశాలు బాగా ఆకట్టుకుంటాయి. విజయ్ ఆంటోనీకి ఈ కేసును ఛేదించడంలో అతడు చేసే సహాయం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. థ్రిల్లర్ సినిమా ప్రియులకు మార్గన్ చిత్రం పర్ఫెక్ట్ బొమ్మ అని చెప్పొచ్చు.

మొత్తం మీద, ‘మార్గన్’ థ్రిల్లర్ ప్రేమికులకు ఖచ్చితంగా నచ్చుతుంది. విజయ్ ఆంటోని, అజయ్ దిశాన్ల నటన, కథనం ప్రేక్షకులను అలరిస్తాయి. ఇప్పటికే ఓటీటీలో క్రేజ్ పెరుగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.