
గ్లామర్ బ్యూటీ మౌనీ రాయ్ తన సోషల్ మీడియా పోస్ట్‌లకు వస్తున్న కామెంట్లపై చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఒక లేడి నెటిజన్ చేసిన దారుణమైన కామెంట్‌కు ఆమె ఇచ్చిన ప్రతిస్పందన ఇప్పుడు వైరల్‌గా మారింది.
Key Points
మౌనీ రాయ్‌పై లేడి నెటిజన్ చేసిన దారుణమైన కామెంట్ వైరల్
మౌనీ రాయ్ ఇచ్చిన ధీటుగా సమాధానం ఆకట్టుకుంది
మౌనీ రాయ్ సర్జరీలు చేసుకుందని వస్తున్న వార్తలపై చర్చ
లేడి నెటిజన్ ఘాటు కామెంట్
గ్లామర్ బ్యూటి మౌనీ రాయ్ సినిమాల్లో హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్, ఐటమ్ సాంగ్స్‌తో అట్రాక్ట్ చేస్తుంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా మౌనీ రాయ్ హాట్, గ్లామర్, బికినీ , బోల్డ్ ఫొటోలతో ట్రెండ్ అవుతుంటుంది. వాటికి వేలల్లో కామెంట్స్ వస్తుంటాయి.
అయితే, శుక్రవారం (ఆగస్ట్ 22) మౌనీ రాయ్ లుక్‌పై దారుణమైన కామెంట్ వచ్చింది. అది కూడా లేడి నెటిజన్ నుంచి. అయితే, ఆ నెటిజన్ కామెంట్‌కు ప్రతీకారంగా మౌనీ రాయ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది.
మౌనీ రాయ్ రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఫొటోలకు అభిమానుల నుంచి విపరీతమైన ప్రేమ లభించింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఆ ఫొటోలకు వేలాది లైకులు, ప్రశంసలు వచ్చాయి. అయితే, పొగడ్తలతోపాటు పాటు కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి.
మౌనీ రాయ్ ధీటు ప్రత్యుత్తరం
“నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది. నువ్వు ఎవరైన సరే.. నీ గొంతులో ఏదో గుచ్చుకున్నట్లు ఉంది. నువ్ పబ్లిక్ ఫిగర్ అయినప్పటి నుంచి చేసుకుంటున్న నీ సర్జరీలు నిన్ను పేదరికంలోకి నెడుతున్నాయి. అవి బాగున్నా, చాలా చెత్తగా ఉన్నా నువ్ వాటి ఫలితాలను అంగీకరించాల్సిందే. నువ్ ఒక మంచి సర్జన్ (డాక్టర్)కు చూపించుకోవడం చాలా బెటర్” అని రక్‌స్తన్ అనే లేడి నెటిజన్ దారుణంగా కామెంట్ చేశారు.
ఆ లేడి నెటిజన్ కామెంట్‌కు అంతే ధీటుగా మౌనీ రాయ్ రిప్లై ఇచ్చింది. “మీ జీవితంలో మీరు కాస్తా విలువైన పనులు చేయండి. మనుషుల పట్ల ప్రేమ లేకుండా ప్రవర్తించడానికి బదులు మీ పని గురించి మాట్లాడండి. అలా లేకపోతే మీకు విలువ ఉండదు. నేను ఏం చెబుతున్నానో మీకు తెలుస్తోంది అనుకుంటున్నా” అని మౌనీ రాయ్ సమాధానం ఇచ్చింది.
దీంతో మౌనీ రాయ్ రిప్లైకి ఇంటర్నెట్‌లో ప్రశంసలు, మద్దతు లభించింది. అయితే, ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆ లేడి నెటిజన్ తన పోస్టును డిలీట్ చేసేశారు. కానీ, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ మాత్రం సోషల్ మీడియాలో అప్పటికే తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్ అయిన స్క్రీన్‌షాట్స్
ఇదిలా ఉంటే, మౌనీ రాయ్‌పై నిత్యం సర్జరీలు చేసుకుందని కామెంట్స్ వినిపిస్తాయి. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చినప్పటి మౌనీ రాయ్‌కు నాగినీ సీరియల్‌లో హీరోయిన్‌గా చేసిన ఈ బ్యూటీకి చాలా తేడా ఉందని చెబుతుంటారు.
కాగా, మౌనీ రాయ్ రీసెంట్‌గా జియో హాట్‌స్టార్ ఓటీటీ సిరీస్ సలాకార్‌లో యాక్ట్ చేసింది. ఇందులో మౌనీ పాకిస్తాన్ గూఢాచారిగా చేసింది. అయితే, నాగినీ సీరియల్‌తో మౌనీ రాయ్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.
మౌనీ రాయ్ యొక్క ధైర్యవంతమైన ప్రతిస్పందన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలను అందుకుంది. ఈ సంఘటన మరోసారి సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన వ్యాఖ్యల ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది.


