
📌 Key Points
- మధ్యప్రదేశ్ 10, 12 తరగతుల ఫలితాలు విడుదల చేసిన సీఎం మోహన్ యాదవ్.
- 12వ తరగతిలో 76.01% ఉత్తీర్ణత, గత 16 ఏళ్లలో ఇదే అత్యధికం.
- 10వ తరగతి టాపర్‌గా పన్నాకు చెందిన ప్రతిభ, 12వ తరగతిలో ఖుషీ రాయ్, చాందిని విశ్వకర్మ టాపర్లుగా నిలిచారు.
- సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫలితాలు విడుదలైన 7 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచన.
మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12వ తరగతి ఫలితాలను ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫలితాలు విడుదల చేసిన సీఎం మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (MPBSE) 10వ తరగతి (హైస్కూల్),12వ తరగతి (హయ్యర్ సెకండరీ) ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బుధవారం ఉదయం ఈ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లైన mpbse.nic.in, mpbse.mponline.gov.in, mpresults.nic.in లలో చూసుకొని మార్క్స్ లిస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షలకు పైగా విద్యార్థులు హాజరు కాగా వీరిలో సుమారు 9.07 లక్షల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు, దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు 12వ తరగతి బోర్డు పరీక్షలు రాశారు. 12వ తరగతిలో మొత్తం ఉత్తీర్ణత శాతం 76.01 శాతం కాగా ఇది గత 16 సంవత్సరాలలో అత్యధికం అని అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించిన వారిలో 72.39 శాతం బాలురు,79.41 శాతం బాలికలు ఉన్నారు. ఇక 10వ తరగతిలో మొత్తం ఉత్తీర్ణత శాతం 73.4 శాతంగా ఉంది. వీరిలో 70.31 శాతం మంది బాలురు,77.52 శాతం మంది బాలికలు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
12వ తరగతి ఫలితాల్లో రికార్డు ఉత్తీర్ణత శాతం
MP బోర్డ్ 12 ఫలితాల్లో టాపర్ గా భోపాల్‌కు చెందిన కామర్స్ విద్యార్థిని కుమారి ఖుషీ రాయ్ లిలిచారు. భోపాల్‌కు చెందిన చాందిని విశ్వకర్మ కూడా సంయుక్తంగా ప్రథమ స్థానం పొందారు. ఈ ఇద్దరు విద్యార్థినులు 594 మార్కులు సాధించారు. ఇక 10వ తరగతి పరీక్షలో పన్నాలోని సరస్వతి జ్ఞాన మందిర్‌కు చెందిన కుమారి ప్రతిభ ప్రథమ స్థానం సాధించింది. ఆమె 500 మార్కులకు 499 మార్కులు సాధించింది.
టాపర్లు వీరే.. వివరాలు ఇక్కడ తెలుసుకోండి
పదో తరగతిలో ఫెయిల్ అయిన వారికి, 12 వ తరగతిలో ఫెయిల్ అయిన వారు మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఫలితాలు విడుదలైన 7 రోజుల్లోపు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
మధ్యప్రదేశ్ బోర్డు ఫలితాలు వెలువడటంతో విద్యార్థులు తమ భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అధికారులు సూచనలు చేశారు.


