
📌 Key Points
- మృణాల్ ఠాకూర్ బ్లాక్ శారీలో మెరుపులు, వైరల్ అవుతున్న ఫోటోలు!
- ‘డెకాయిట్’ మూవీలో అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మృణాల్
- ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ లైక్స్ కొల్లగొట్టిన మృణాల్ తాజా పిక్స్
- గోల్డ్ ఎంబ్రాయిడరీతో ఉల్లిపొరలాంటి శారీలో మృణాల్ అందాల విందు
మృణాల్ ఠాకూర్ మరోసారి తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బ్లాక్ శారీలో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.
బ్లాక్ శారీలో మృణాల్ మెరుపులు
మృణాల్ ఠాకూర్ ‘సీత రామం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం, ఇందులో ఈమె తన అద్భుతమైన నటనతో ఆకట్టుకోవడంతో ఈ చిత్రం ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు వచ్చింది. దాంతో వరుసగా ఈమె తెలుగు చిత్రాల్లో నటిస్తుందని చాలామంది భావించారు.
కానీ ఈమె మాత్రం అలా అస్సలు చేయడం లేదు. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలలో మాత్రమే నటిస్తూ వస్తోంది. దాంతో ‘సీత రామం’ విడుదలై ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ, ఈ నటి తెలుగులో చేసిన సినిమాల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. అందులో ఒకటి, రెండు చిత్రాలు తప్పితే మిగతా అన్నీ మంచి విజయాలను అందుకున్నాయి.
‘డెకాయిట్’తో మృణాల్‌కు ప్రశంసలు
తాజాగా మృణాల్, అడవి శేష్ హీరోగా రూపొందిన ‘డెకాయిట్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో ఈ బ్యూటీ నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాల్లో ఈమె ఎక్కువ శాతం గ్లామర్ షోకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయడం లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తన గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అందులో ఈ హీరోయిన్ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ కలిగిన ఉల్లిపోరలాంటి పలుచటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని, అందుకు తగిన బ్లౌజ్ ధరించి ఎంతో అందమైన నవ్వుతో ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఇందులో ఈమె చెవులకు ఇయర్ రింగ్స్, చేతికి ఉంగరం పెట్టుకుంది. ఇవి ఈమె అందాన్ని మరింత హైలెట్ చేశాయి.
వైరల్ అవుతున్న ఫోటోలు, మిలియన్ లైక్స్!
ఇక కురులను ఎంతో స్వేచ్ఛగా వదిలేసింది. ఈ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మృణాల్ ఎంతో అందంగా కనిపించడంతో పెద్ద ఎత్తున ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఇన్‌స్టాలో ఈ ఫోటోలకు ఏకంగా 1 మిలియన్ లైక్స్ కూడా దక్కాయి. అలాగే కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది ఈ పిక్స్‌కు బ్యూటిఫుల్, సో క్యూట్ లాంటి కామెంట్స్‌తో పాటు లవ్, ఫైర్ సింబల్ ఎమోజీలను కామెంట్లుగా పెడుతున్నారు.
Photos Courtesy: Instagram
మృణాల్ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. ఆమె అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


