|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ధనుష్‌తో మృణాల్ లవ్ ట్రాక్? షాకింగ్ కామెంట్స్! టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

Published: 19-02-2026, 11:35 PM
ధనుష్‌తో మృణాల్ లవ్ ట్రాక్? షాకింగ్ కామెంట్స్! టాలీవుడ్‌లో హాట్ టాపిక్!
  • ధనుష్‌తో కలిసి పనిచేయాలని ఉందన్న మృణాల్ కోరిక – త్వరలో భారీ ప్రాజెక్ట్?
  • సన్ ఆఫ్ సర్దార్-2 స్క్రీనింగ్‌కు ధనుష్ రావడంతో ఆనందం వ్యక్తం చేసిన మృణాల్
  • ధనుష్ ఒక అద్భుతమైన సంస్థ అని కొనియాడిన మృణాల్ ఠాకూర్
  • రాయన్, మారి, రాంఝనా చిత్రాలతో ధనుష్‌కు వీరాభిమానిగా మారిన మృణాల్

టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్, ధనుష్‌ల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృణాల్ ధనుష్ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

ధనుష్‌పై మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు వైరల్ అవ్వడంతో అభిమానుల్లో రకరకాల అనుమానాలు మొదలయ్యాయి. అయితే, ఈ వార్తలపై మృణాల్ ఇప్పటికే స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లకు చెక్ పడటం లేదు. వీరిద్దరికి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. అంతేకాకుండా.. వారు పలు ఈవెంట్లలో సన్నిహితంగా కనిపించడంపై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. అసలు కలిసి ఒక్క సినిమా కూడా చేయని వీరిద్దరి మధ్య ఇంతటి స్నేహం ఎలా కుదిరిందనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ిదొక పెద్ద మిస్టరీగా మారింది. ఈక్రమంలో.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్, ధనుష్‌తో తనకున్న అనుబంధంపై ఆసక్తికర విషయాలను పంచుకుంది.

త్వరలో వీరిద్దరి కాంబో రానుందా?

‘‘ధనుష్ సార్ తన సినిమా ‘తేరే ఇష్క్ మే’ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పుడు, నేను ఆయనను ‘సన్ ఆఫ్ సర్దార్-2’ స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఆహ్వానించాను. ఆయన వస్తారని నేను అస్సలు అనుకోలేదు, కానీ ఆయన రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’’ అని మృణాల్ పేర్కొంది. ధనుష్ వంటి పెద్ద స్టార్ తన ఆహ్వానాన్ని మన్నించి రావడం పట్ల ఆమె తన కృతజ్ఞతను చాటుకుంది. ధనుష్‌పై తనకున్న అభిమానాన్ని మృణాల్ ఎంతో గొప్పగా వివరించింది. ‘‘ధనుష్ సార్ ఒక నటుడు మాత్రమే కాదు, ఆయన ఒక అద్భుతమైన సంస్థ . ఆయన గొప్ప గాయకుడు, డ్యాన్సర్, గీత రచయిత, దర్శకుడు కూడా. ఆయనలోని బహుముఖ ప్రజ్ఞను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ధనుష్ సర్‌తో కలిసి పనిచేయాలని నాకు కోరికగా ఉంది’’ అని చెప్పింది.

వైరల్ అవుతున్న మృణాల్ కామెంట్స్

ముఖ్యంగా రాయన్, మారి, రాంఝనా వంటి చిత్రాలు చూశాక తాను ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని, ‘అసురన్’ సినిమాను ఎన్నిసార్లైనా చూడగలనని మృణాల్ తన మనసులోని మాటను బయటపెట్టింది. మృణాల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధనుష్‌తో కలిసి పని చేయడం తన కల అని ఆమె చెప్పడంతో, త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూనే, వృత్తిపరంగా ధనుష్ పట్ల తనకున్న గౌరవాన్ని మృణాల్ చాటుకోవడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.మరికొందరు షాక్ అవుతున్నారు. మొత్తానికి నటించాలని ఉందని అసలు విషయం బయటపెట్టిందిగా అని అంతా గుసగుసలాడుకుంటున్నారు. మరోసారి వీరిద్దరు రిలేషన్‌పై పలు రకాలుగా చర్చలు మొదలయ్యాయి.

మొత్తానికి మృణాల్ మనసులో మాట బయటపెట్టింది. ధనుష్ తో కలిసి నటించాలని ఉందని చెప్పింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.