
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మృణాల్ ఠాకూర్, తాజాగా సోషల్ మీడియాలో పార్క్‌లో దిగిన ఫోటోలతో రచ్చ చేసింది. ఆమె ఫోటోలకు నెటిజన్ల నుండి భారీ స్పందన లభిస్తుండగా, ఆఫర్ల కోసమే ఈ ప్రచారమా అనే చర్చ జరుగుతోంది.
Key Points
మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది.
పార్క్‌లో దిగిన ఆమె ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు సినిమా ఆఫర్లు తగ్గడంతో ఈ ఫోటోలు ఆమె ప్రచారమేనా అని చర్చ.
హిందీ సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది.
మృణాల్ ఠాకూర్ తెలుగు సినిమా ప్రయాణం
మృణాల్ ఠాకూర్.. `సీతారామం` చిత్రంలో సీతగా మెప్పించింది. ఈ ఒక్క మూవీతోనే ఆమె తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. వారి గుండెల్లో స్థానం సంపాదించింది.
సీత పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు, సినిమాని దర్శకుడు హనురాఘవపూడి మలిచిన తీరు, ముఖ్యంగా ఆమె పాత్రని తీర్చిదిద్దిన తీరు, ఆమెకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని తీసుకొచ్చింది.
ఈ ఒక్క మూవీనే మృణాల్ ఠాకూర్ ని స్టార్ హీరోయిన్‌ని చేసింది. వరుసగా ఆఫర్లని తీసుకొచ్చింది. తెలుగులో ఈ అమ్మడికి ఆ తర్వాత మంచి ఆఫర్లు వచ్చాయి.
నానితో కలిసి `హాయ్ నాన్న` చిత్రంలో నటించింది. ఇందులో యష్నగా ఆమె ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె పాత్ర చుట్టూతే సినిమా తిరగడం విశేషం. ఈ మూవీ డీసెంట్ విజయాన్ని అందుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
ఆ తర్వాత విజయ్ దేవరకొండతో `ఫ్యామిలీ స్టార్`లో నటించింది. అయితే ఎంతో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. డిజప్పాయింట్ చేసింది.
దీంతో తెలుగుతో మృణాల్‌కి ఆఫర్లు తగ్గాయి. తాను సెలక్టీవ్‌గా వెళ్తుందా? తనకు అవకాశాలు తగ్గాయా? ఏమైందో ఏమో ఆమె తెలుగులో సినిమాలు చేయడం లేదు.
ఇప్పుడు కేవలం అడవి శేషు `డెకాయిట్`లోనే నటిస్తుంది. అది కూడా శృతి హాసన్ ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మృణాల్‌ని ఎంపిక చేశారు.
అయితే హిందీలో బిజీగా ఉంది మృణాల్. తన కెరీర్‌ని అక్కడి నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడే మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దీంతో తెలుగులో ఆఫర్లు తగ్గాయని చెప్పొచ్చు.
ఆఫర్ల కోసమే ఈ రచ్చ?
తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలతో రచ్చ చేసింది మృణాల్. పార్క్ లో దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో స్లీవ్ లెస్ డ్రెస్‌లో ఆమె అదరగొడుతుంది. ప్రకృతిలో పరవశించిపోతూ అభిమానులను ఆకట్టుకుంది.
ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా అందమైన అమ్మాయి అని, చూడ్డానికి దేవతలా ఉందని అంటున్నారు. స్వచ్ఛమైన మనసు కలిగిన హీరోయిన్ అని మరొకరు కామెంట్ పెట్టారు.
మొత్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలతో రచ్చ చేస్తూ, చర్చనీయాంశం అయ్యింది మృణాల్ ఠాకూర్. సినిమా ఆఫర్ల కోసమే ఇలా గ్లామర్ పిక్స్ ని పంచుకుంటున్నారేమో అని నెటిజన్లు కామెంట్ చేయడం గమనార్హం.
మొత్తానికి, మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో తన అందంతో అభిమానులను ఆకట్టుకుంటోంది. తెలుగు సినిమాల్లో ఆమెకు మళ్ళీ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.


