
📌 Key Points
- మృణాల్ ఠాకూర్ నటించిన ‘సీతారామం’ చిత్రం తెలుగులో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది.
- నటిగా ఉండటం మాజీ ప్రియుడికి నచ్చకపోవడంతో బ్రేకప్ జరిగిందని మృణాల్ తెలిపింది.
- విజయ్ దేవరకొండతో ‘ది ఫ్యామిలీ స్టార్’, నానితో ‘హాయ్ నాన్న’ చిత్రాల్లో మృణాల్ నటించింది.
- ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ నటిస్తోంది.
మృణాల్ ఠాకూర్ తన బ్రేకప్ గురించి మొదటిసారిగా స్పందించారు. తాను నటిగా ఉండటం తన మాజీ ప్రియుడికి ఇష్టం లేకపోవడం వల్లే విడిపోయామని ఆమె వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీతారామం సినిమాతో మృణాల్‌కు గుర్తింపు
Mrunal thakur:మృణాల్ ఠాకూర్(Mrunal Thakur).. హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘సీతారామం’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సీత అనే పాత్రలో ఒదిగిపోయి నటించింది. కట్టుబొట్టుతో అందరి హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే ఊహించని పాపులారిటీ లభించడంతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఇప్పటికే ఈ సినిమా తర్వాత తెలుగులో నానితో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ తో ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలు చేసింది. కానీ సీతారామం సినిమా అందించిన విజయాన్ని మరో చిత్రం అందించలేదు అనడంలో సందేహం లేదు.
ఇకపోతే ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇలా ఒకవైపు సినిమాలలో అవకాశాలు అందుకుంటూనే మరొకవైపు సోషల్ మీడియాలో పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా నెపోకిడ్స్ పై ఊహించని కామెంట్లు చేసి వార్తల్లో నిలిచిన ఈమె తొలిసారి తన బ్రేకప్ పై స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకే విడిపోయాం అంటూ మృణాల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బ్రేకప్‌కు కారణం చెప్పిన మృణాల్
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. “నేను నటిని కావడం నా మాజీ బాయ్ కి నచ్చలేదు. నువ్వు చాలా ఇంపల్సివ్ గా ఉంటావు. నేను దీన్ని హ్యాండిల్ చేయలేను. పైగా నువ్వు హీరోయిన్ వి. అది కూడా నాకు నచ్చదు అంటూ తెలిపారు. అందుకే నేను ఆయనతో బ్రేకప్ చెప్పుకున్నాను. ఆ రిలేషన్ ముగిసిపోవడం నాకు మంచే జరిగింది. లేదంటే భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడేదాన్ని” అంటూ తన బ్రేకప్ గురించి స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచింది మృణాల్ ఠాకూర్. మొత్తానికైతే బ్రేకప్ మంచికే అంటూ చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
మృణాల్ ఠాకూర్ తదుపరి సినిమాలు
ప్రస్తుతం ఈమె హిందీలో ధో దీవానే సెహర్ మేన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది .ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె నటిస్తున్న ఈ సినిమా విషయానికి వస్తే.. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటించిన ఈ హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రానికి రవి ఉద్యవార్ దర్శకత్వం వహించారు. సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రోష్ని, శశాంక్ కీలక పాత్రలు పోషించారు అలాగే జాయ్ సేన్ గుప్తా, ఆయేషా , రజామిశ్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు . ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది . ఇకపోతే ఈ చిత్రం హిందీ సినిమా అయినప్పటికీ ఇందులో టాలీవుడ్ లో ప్రజా ధారణ పొందిన మృనాల్ ఠాకూర్ నటించడంతో తెలుగు మీడియాలో కూడా ఈ సినిమా అందరూ దృష్టిని ఆకర్షించిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.
మొత్తానికి మృణాల్ ఠాకూర్ తన బ్రేకప్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె త్వరలో ‘డెకాయిట్’ సినిమాతో ప్రేక్షకులను అలరించనుంది.


