|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: అవకాశాల కోసం డైరెక్టర్లను బతిమిలాడాను! మృణాల్ ఠాకూర్ సంచలన కామెంట్స్ వైరల్!

Published: 17-02-2026, 3:05 AM
షాకింగ్: అవకాశాల కోసం డైరెక్టర్లను బతిమిలాడాను! మృణాల్ ఠాకూర్ సంచలన కామెంట్స్ వైరల్!
  • మృణాల్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు: అవకాశాల కోసం ఎంతలా బతిమిలాడేదాన్నో చెప్పిన హీరోయిన్!
  • రవి సర్ ‘మామ్’ సినిమా చూసి ఫిక్స్ అయ్యా.. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసా?
  • ఫస్ట్ డైరెక్టర్ ఆదిత్య ధర్ గారినే పని అడిగాను: మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్!
  • బాలీవుడ్ లో అవుట్ సైడర్ గా అడుగుపెట్టి స్టార్ గా ఎదిగిన మృణాల్ సక్సెస్ సీక్రెట్స్!

బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె కెరీర్ ప్రారంభంలో పడ్డ కష్టాల గురించి స్వయంగా వెల్లడించారు. ఆ వివరాలు చూద్దాం!

అవుట్ సైడర్ గా అడుగుపెట్టి స్టార్ గా ఎదిగిన మృణాల్

బాలీవుడ్‌లో అవుట్‌సైడర్‌గా అడుగుపెట్టి స్టార్‌గా ఎదిగిన మృణాల్ ఠాకూర్ తన కెరీర్ ఆరంభంలో పడ్డ కష్టాలను పంచుకున్నారు. అవకాశాల కోసం దర్శకుల వెంట పడటంలో తప్పులేదని, తన తాజా చిత్రం ‘దో దీవానే షెహర్ మే’ కూడా అలా వచ్చిందేనని, ఆకలితో ఉన్నట్లు తెలిస్తేనే వాళ్ల ఆలోచన విధానం మారుతుందని మృణాల్ ఠాకూర్ చెప్పారు.

సినిమా పరిశ్రమలో వారసత్వం లేకుండా నిలదొక్కుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. సుమారు 15 ఏళ్ల క్రితం నటిగా కెరీర్ మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ నేడు దక్షిణాదిలోనూ, బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే, ఈ స్థాయికి చేరుకోవడానికి మృణాల్ ఠాకూర్ పడ్డ శ్రమ, చూపిన ధైర్యం సామాన్యమైనవి కావని చెబుతోంది. తాజాగా ఇచ్చిన సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తన కెరీర్ రహస్యాలను మృణాల్ ఠాకూర్ బయటపెట్టారు.

దర్శకుల వెంట పడటంలో తప్పులేదు అంటున్న మృణాల్ ఠాకూర్

“రవి సర్ తీసిన ‘మామ్’ సినిమా చూశాక ఆయనతో పని చేయాలని ఫిక్స్ అయ్యాను. నేనే నేరుగా వెళ్లి.. సర్, మనం నెక్ట్స్ సినిమా ఎప్పుడు చేస్తున్నాం? అని అడిగేశాను. నాలో ఉన్న ఆ ధైర్యమే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టిందని నేను నమ్ముతాను” అని మృణాల్ ఠాకూర్ న్యూస్18తో పేర్కొన్నారు.

దర్శకుల వెంట పడటం తప్పు కాదు. .

మొదటి డైరెక్టర్ ఆయనే.. షాకింగ్ విషయాలు చెప్పిన మృణాల్

కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు అంత సులభంగా రాలేదని మృణాల్ గుర్తుచేసుకున్నారు. “ఒక అవుట్‌సైడర్‌గా నా ముఖం దర్శకులకు కనిపించేలా చేసుకోవడానికి నేను చాలా ప్రయత్నించాను. సర్, నేను ఇక్కడే ఉన్నాను.. ఏదో ఒక రోజు నన్ను తప్పకుండా కాస్ట్ చేయండి అని బతిమిలాడేదాన్ని” అని మృణలా ఠాకూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

“‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ గారే నేను పని కోసం అడిగిన మొదటి వ్యక్తి. అప్పట్లో పని ఎలా అడగాలో కూడా నాకు సరిగ్గా తెలియదు” అని మృణాల్ ఠాకూర్ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

మృణాల్ ఠాకూర్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఆమె రాబోయే సినిమాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.