
📌 Key Points
- మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది కలిసి ‘దో దీవానే సేహర్ మేన్’లో నటిస్తున్నారు.
- సినిమా ప్రమోషన్లలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
- సిద్ధాంత్ సోషల్ మీడియాలో ‘దో దీవానే’ సాంగ్‌తో రీల్ షేర్ చేయడంతో రూమర్లు ఊపందుకున్నాయి.
- వీరి మధ్య కెమిస్ట్రీ నిజమైన ప్రేమనా లేక సినిమా ప్రమోషనా అనేది వేచి చూడాలి.
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, నటుడు సిద్ధాంత్ చతుర్వేది మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ‘దో దీవానే సేహర్ మేన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో వీరి సాన్నిహిత్యం చర్చనీయాంశంగా మారింది.
ధనుష్ నుండి సిద్ధాంత్ వైపు మృణాల్?
Mrunal Thakur: బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వేగంగా వైరల్ అవుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు ఆమె పేరు ధనుష్‌తో జత చేయబడింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధనుష్ పేరు క్రమంగా పక్కకు వెళ్లిపోయి, ఇప్పుడు మృణాల్ పేరు సిద్ధాంత్ చతుర్వేదితో ఎక్కువగా వినిపిస్తోంది.
నిన్నటి నుంచి ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొదట ఇది కేవలం గాసిప్ అనుకున్నారు చాలామంది. కానీ ఇప్పుడు వరుసగా వస్తున్న అప్డేట్స్ చూసి, ఇది కేవలం రూమర్ కాదేమో అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.
మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది ఇద్దరూ కలిసి నటించిన తాజా చిత్రం ‘దో దీవానే సేహర్ మేన్’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 2026లో థియేటర్లలోకి రానుంది. సినిమా ప్రమోషన్ల సమయంలో వీరిద్దరి మధ్య కనిపిస్తున్న సాన్నిహిత్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
‘దో దీవానే సేహర్ మేన్’ సినిమాతో చిగురించిన ప్రేమ?
ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్‌లో మృణాల్, సిద్ధాంత్ కలిసి కనిపించారు. ఆ సమయంలో ఇద్దరూ చాలా సౌకర్యంగా, స్నేహపూర్వకంగా మాట్లాడుతూ కనిపించారు. వారి మధ్య ఉన్న అనుబంధం చూసిన అభిమానులు..ఇది సినిమాకే పరిమితమా లేక నిజ జీవితానికీ సంబంధమా?. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ చర్చకు మరింత ఊపొచ్చేలా సిద్ధాంత్ చతుర్వేది తన సోషల్ మీడియా ఖాతాలో ఓ రీల్ షేర్ చేశాడు. ఆ వీడియోకు సినిమా టైటిల్ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌గా పెట్టి, దో దీవానే ..అనే చిన్న క్యాప్షన్ మాత్రమే ఇచ్చాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమా దర్శకుడు రవి ఉద్యావర్. సాధారణ లవ్ స్టోరీలకంటే భిన్నంగా, నిజ జీవిత ప్రేమలో ఉండే భావోద్వేగాలు, అయోమయాలు, లోపాలను చూపించడమే ఈ సినిమా లక్ష్యమని చెబుతున్నారు. అందుకే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్
జీ స్టూడియోస్, భన్సాలి ప్రొడక్షన్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మృణాల్.. సిద్ధాంత్ జంటలోని సహజమైన కెమిస్ట్రీ ఈ సినిమాకే కాకుండా, వారి వ్యక్తిగత జీవితాలపై కూడా ఆసక్తిని పెంచుతోంది.
ఇది నిజమైన ప్రేమకథా? లేక సినిమా ప్రమోషన్లో భాగమా? అన్నది తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. కానీ ప్రస్తుతానికి మాత్రం మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు.
మృణాల్, సిద్ధాంత్ మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమైన ప్రేమనా, సినిమా ప్రమోషన్లో భాగమా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా ఈ జంట మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.


