|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి విశ్వరూపం: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ సంచలనం! 50 రోజుల రికార్డు బ్రేక్!

Published: 02-03-2026, 2:05 PM
చిరంజీవి విశ్వరూపం: ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ సంచలనం! 50 రోజుల రికార్డు బ్రేక్!
  • ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం 109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది.
  • ఈ చిత్రం రీజినల్ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
  • చిరంజీవి, అనిల్ రావిపూడి కెరీర్‌లో ఇది తొలి రూ. 400 కోట్ల బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
  • బుక్‌మైషోలో 3.8 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం 109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేటర్లలో మంచి ఆదరణ పొందుతోంది.

50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి

MSG Movie: రీసెంట్‌గా వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) మూవీతో.. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) మరోసారి తాను మాస్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌లో తిరుగులేని రాజుని అని నిరూపించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించే 50 రోజుల థియేట్రికల్ రన్ సాధించింది. ప్రస్తుతం OTT ప్రభావంతో థియేటర్ రన్స్ 2 వారాలకే పడిపోతున్న పరిస్థితుల్లో కూడా, ZEE5 ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. OTT ప్లాట్‌ఫారమ్ ZEE5 లో కూడా MSG ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి, పలు భాషల్లో నెంబర్ 1 ట్రెండింగ్‌గా కొనసాగడం మెగాస్టార్ క్రేజ్‌కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

రికార్డులు బద్దలు కొట్టిన వసూళ్లు

తాజాగా ఈ చిత్రం 109 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ చిత్రం రీజినల్ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి, అనిల్ రావిపూడి (Anil Ravipudi) కెరీర్‌లో తొలి రూ. 400 కోట్ల బ్లాక్‌బస్టర్‌గా రికార్డు సృష్టించింది. ఉత్తర అమెరికాలో దాదాపు 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి గ్లోబల్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా పవరేంటో చాటింది. అలాగే బుక్‌మైషోలో 3.8 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవడం రీజినల్ సినిమాల్లో హయ్యస్ట్ రికార్డ్‌ అని కూడా మేకర్స్ ప్రకటించారు. కాబట్టి.. ఈ విజయానికి ప్రధాన కారణం చిరంజీవి రిఫ్రెషింగ్, ఎనర్జిటిక్ అవతార్ అని కచ్చితంగా చెప్పుకోవాల్సిందే.

చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్

ఇందులో మెగాస్టార్ లైవ్లీ ఎక్స్‌ప్రెషన్స్, యూత్‌ఫుల్ ఎనర్జీ, అద్భుతమైన కామిక్ టైమింగ్ ప్రేక్షకులను మళ్లీ గోల్డెన్ ఎరాకు తీసుకెళ్లాయి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు పేరుపొందిన అనిల్ రావిపూడి మరోసారి అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకునే క్లాసిక్‌ను అందించడంతో జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. పండుగ సీజన్‌లో ఫ్యామిలీస్ మెయిన్ చాయిస్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో ప్రదర్శించబడటం అంటే మాములు విషయం కాదు. సంక్రాంతి సినిమాల తర్వాత సరైన సినిమా థియేటర్లలోకి రాలేదు. మరోవైపు ఈ సినిమాకు కలెక్షన్స్ బాగా వస్తుండటంతో, థియేటర్స్ వాళ్లు కూడా ఈ సినిమానే రన్ చేస్తూ వచ్చారు. అలా ఎక్స్ ట్రార్డినరీ 50 రోజుల ఫీట్‌ను ఈ చిత్రం అందుకుని మరో రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ విజయంతో మెగా ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు.

మొత్తానికి, చిరంజీవి ఎప్పటిలాగే తన ఎనర్జీతో, యూత్‌ఫుల్ నటనతో ప్రేక్షకులను అలరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది చిరంజీవి కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.