|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నభా నటేష్ సంచలన నిర్ణయం! అమ్మవారి ఆలయానికి వెళ్లడానికి కారణం ఇదేనా?

Published: 28-02-2026, 6:05 AM
  • నభా నటేష్ భద్రకాళీ అమ్మవారి ఆశీస్సుల కోసం దేవాలయానికి వెళ్లారు.
  • ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
  • నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
  • స్వయంభు, నాగబంధం చిత్రాలతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నటి నభా నటేష్ ఇటీవల భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తిరిగి సినిమాల్లో బిజీ అవుతున్న సందర్భంగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

నభా నటేష్ దేవాలయ సందర్శన

Nabha Natesh: సాధారణంగా సామాన్య ప్రజలైనా.. సెలబ్రిటీలైనా దేవాలయాలను ఎందుకు సందర్శిస్తారు.. మనశ్శాంతి కోసం.. అనుకున్న పనులు సవ్యంగా సాగాలని.. గుర్తింపు రావాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా అమ్మవారి సేవలో అలాంటి ఆలోచనతోనే నిమగ్నమయ్యాను అని ఫోటోల రూపంలో చెప్పుకొచ్చింది ప్రముఖ యంగ్ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh). తాజాగా ఈ మధ్యకాలంలో ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకుంటున్న నభా నటేష్.. తాజాగా భద్రకాళీ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి టెంపుల్ కి వెళ్ళింది. అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మునిగితేలిన ఈమె.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా భద్రకాళీ అమ్మవారి ఆశీస్సుల కోసం దేవాలయానికి వెళ్లిన నభా నటేష్ అక్కడ పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీస్సులు అందుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అభిమానులు సైతం పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇన్ని రోజుల తర్వాత అమ్మవారి ఆలయంలో కనిపించడంతో అందుకోసమే అమ్మవారి దీవెనలు పొందడానికి వెళ్లారా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నభా నటేష్ విషయానికి వస్తే.. శృంగేరి ప్రాంతానికి చెందిన ఈమె ‘వజ్రకాయ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నన్ను దోచుకుందువటే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన నభా నటేష్..’ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఊహించిన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది ఈ ముద్దుగుమ్మ. మధ్యలో 2022లో కాస్త యాక్సిడెంట్ కావడంతో ఇంటికే పరిమితమైంది. ఇప్పుడు మళ్లీ తనను తాను మార్చుకొని ఏకంగా రెండు చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే సక్సెస్ కోసం పలు ప్రయత్నాలు చేస్తోంది.

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

2026 సమ్మర్ టార్గెట్ గా ఒకటి కాదు ఏకంగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘స్వయంభు’, ‘నాగబంధం’ అనే రెండు పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ రెండు చిత్రాలు కూడా పూర్తి భిన్నమైన కథ నేపథ్యాలతో రూపొందుతున్నాయి. స్వయంభూ సినిమాలో సుందరవల్లి అనే ఒక హుందాతనమైన యువరాణి పాత్రలో నభా కనిపించబోతోంది. ఇక నాగబంధం సినిమాలో పార్వతి అనే పవర్ఫుల్ పాత్ర పోషిస్తుంది. ఒకే సీజన్లో ఒక యంగ్ హీరోయిన్ నటించిన రెండు భిన్నమైన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాలు విడుదల కాబోతుండడం టాలీవుడ్లో అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన టీజర్లు విడుదల కాగా.. రెండింటికి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

ఇక ఈ చిత్రాల విజయం పై పూర్తి ధీమాతో ఉన్న ఈమె అటు అమ్మవారి ఆశీస్సులు కూడా పొందడానికి ఇప్పుడు ఇలా దేవాలయంలో కనిపించి సందడి చేసింది. మొత్తానికైతే ఈ రెండు చిత్రాలతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్న నభా నటేష్ కి అమ్మవారి ఆశీస్సులు కూడా తోడైతే ఇక ఖచ్చితంగా ఆమె ఈ ఏడాది పాన్ ఇండియా హీరోయిన్గా అవతరిస్తుంది అనడంలో సందేహం లేదు.

తిరిగి సినిమాల్లోకి నభా నటేష్

Tags nabha natesh tollywood Share

ప్రస్తుతం నభా నటేష్ రెండు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల సక్సెస్ కోసం ఆమె దేవుడి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఆమె ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.