|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నేటి రాశి ఫలాలు (ఆగస్టు 1, 2025): జాగ్రత్త అవసరమైన రాశులు, శ్రీ సుదర్శన కవచ పఠనం

Published: 31-07-2025, 6:45 PM
నేటి రాశి ఫలాలు (ఆగస్టు 1, 2025): జాగ్రత్త అవసరమైన రాశులు, శ్రీ సుదర్శన కవచ పఠనం

ఆగస్టు 1, 2025 నాటి రాశిఫలాలను ఇక్కడ చూడండి. ప్రతి రాశి వారికి ఈ రోజు ఎలా ఉంటుందో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ భక్తిపూర్వక పరిహారాలు చేయవచ్చో తెలుసుకోండి.

Key Points

1

ప్రతి రాశికి ఆగస్టు 1, 2025 నాటికి ప్రత్యేక సూచనలు.

2

కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించడం.

4

ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్త అవసరం.

వివిధ రాశులకు దిన ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 01.07.2025

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ

మాసం: శ్రావణ మాసం : శుక్రవారం, తిథి : శు. అష్టమి, నక్షత్రం : స్వాతి

మేష రాశి వారి పనుల్లో ఆటంకాలు, మానసిక ఆందోళన, భూ–గృహ–వాహనాదులు విక్రయించుట, ప్రయాణములు, గృహమందు కలహములు, వేళ తప్పి భోజనము చేయడం, ఆర్థిక ఇబ్బందులు, అపమృత్యు భయములు, చెడు వారితో స్నేహము, స్థిరత్వం లేమి వంటివి కలగగలవు. ప్రతిరోజు సుందరకాండ సంగ్రహము పఠించిన మేలు కలుగును.

వృషభ రాశి వారికి శరీరబలం, కీర్తి, ఉత్సాహము, బంధు–మిత్రుల కలయిక, తలచిన పనులు నెరవేరుట, నూతన వస్తువుల కొనుగోలు, మనస్సున ధర్మకార్యములందు ఆసక్తి, బంధుమిత్రుల కలయిక, నూతన వ్యక్తులతో ఆనందం, నూతన ఉత్సాహము, సంఘమున గౌరవాభివృద్ధి, పరిచయములు కలుగును.

మిథున రాశి వారికి మానసిక ఒత్తిడి, పనులలో ఆటంకములు, శస్త్రచికిత్సలు, నమ్మినవారివలన మోసాలు, వాహన ప్రమాదములు, మానసిక ఆందోళనలు, మర్మార్థులతో స్నేహము, జాయింట్ వ్యాపారములు, అకాల భోజనం, ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు సుదర్శనకవచము పఠిస్తే మేలు కలుగును.

జాగ్రత్త అవసరమైన రాశులు

కర్కాటక రాశి వారి ఇంట్లో అనారోగ్యం, కలహములు, పనులలో కష్టములు, వృథా సంచారము, సంఘమున గౌరవము లేకపోవడం, ప్రయాణములలో ఆటంకములు, సుఖము లేకపోవడం, నమ్మినవారి వల్ల పడిన బాధలు. ప్రతిరోజు శ్రీరామరక్షా స్తోత్రము పఠించిన మేలు కలుగును.

సింహ రాశి వారికి ప్రయత్న కార్యములు నెరవేరుట, సంఘమునందు గౌరవము, కీర్తి, మనోల్లాసము, ధన ధాన్య లాభములు, నూతన వస్తువు, వాహనం, గృహ లాభములు, ప్రయాణములందు కలిసివచ్చుట, దేవతాదర్శనములు, నూతన వ్యక్తుల పరిచయములు, బంధుమిత్రుల కలయిక, యజ్ఞ–యాగాది క్రతువులలో పాల్గొనుట, సత్పురుషుల దర్శనములు కలుగును.

అధికారుల నుండి ఒత్తిడి, అధిక ధన వ్యయం, అపకీర్తి, బంధు మిత్ర విరోధము, అపమృత్యు భయము, శరీర అనారోగ్యత, సంఘమున గౌరవము కాపాడుకోవలెను. వృథా సంచారము, గృహమందు కలహములు, శరీరపీడలు, ఉద్యోగస్థులకు వ్యాపారస్థులకు చిక్కులు అధికము, మధ్యవర్తిత్వము పనికిరాదు. జాగ్రత్తగా వ్యవహరించవలెను. ప్రతిరోజు శ్రీ సుదర్శన కవచము పఠించిన మేలు కలుగును.

తుల రాశి వారికి ద్రవ్య లాభము, మనస్సునందు ఉత్సాహము, గృహ, ధన–ధాన్య లాభములు, సంతోషము, ధర్మకార్యములయందు ఆసక్తి, మంచి ఆరోగ్యం, బంధు మిత్రుల కలయిక, నూతన వస్తువుల కొనుగోలు, నూతన వ్యక్తుల పరిచయములు, యాత్రా ఫలప్రాప్తి కలుగును.

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో వారికి ఆటంకములు, అధిక ధన వ్యయం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు, ఉద్యోగ భయములు కలుగును. ప్రయాణ ప్రమాదములు, శస్త్ర చికిత్సలు, అపమృత్యు భయములు, చేయు వృత్తిలో నష్టములు, నమ్మినవారివలన మోసము. ప్రతిరోజు సుందరకాండ సంగ్రహము పఠించిన మేలు కలుగును.

భక్తిపూర్వక పరిహారాలు

ధనుస్సు రాశి వారికి నూతన పనులు తలపెట్టుట, వ్యాపారమందు లాభములు, సంతోషము, మంచి ఆరోగ్యం, నూతన వ్యక్తుల పరిచయములు, గృహ కొనుగోలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బంధుమిత్రుల కలయిక, స్త్రీ మూలకంగా ధన లాభము కలుగును.

ప్రయత్నించిన కార్యములు నెరవేరుట, ద్రవ్య లాభములు, నూతన పనులు తలపెట్టుట, భూ–గృహ వ్యాపారమందు విశేష లాభము, సంతోషము, పుణ్యతీర్థ సందర్శనము, యజ్ఞ–యాగాది క్రతువులో పాల్గొనుట, నూతన వ్యక్తుల పరిచయము, దేవతాదర్శనము కలుగును.

కుంభ రాశి వారికి సంఘమునందు కీర్తి, మనోల్లాసము, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ప్రయాణమందు లాభములు, గృహ, వస్త్ర లాభములు, ప్రయత్నించిన కార్యములు నెరవేరుట, ధన–ధాన్య సమృద్ధి, నూతన వ్యక్తుల పరిచయములు, పుణ్యతీర్థ సందర్శనము కలుగును.

మానసిక ఒత్తిడి అధికము, చేయు పనులయందు ఆటంకములు, నమ్మినవారివలన మోసాలు, వాహన ప్రమాదములు, శస్త్రచికిత్సలు, రాజాగ్ని, చోరబాధలు, ఆర్థిక ఇబ్బందులు, అకాల భోజనం, చెడు వారితో స్నేహము, క్రుంగిపోవడం, భయమధికము, సంఘమున గౌరవము కాపాడుకోవలెను. ప్రతిరోజు శ్రీ సుదర్శన కవచము, ఆదిత్య హృదయము పఠించిన మేలు కలుగును.

పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -9494981000

ఈ రాశిఫలాలు సూచనలు మాత్రమే. మీ వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. భక్తి, శ్రద్ధతో జీవితం గడపండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.