
ఆగస్టు 2, 2025 శనివారం నాటి రాశి ఫలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు మీ రాశికి ఏమి జరగబోతుందో తెలుసుకోవడానికి ఈ రాశి ఫలాలను చదవండి. మీ రోజును సుఖంగా గడపడానికి సహాయపడే సూచనలు కూడా ఇవ్వబడ్డాయి.
Key Points
మేష రాశివారు పనుల పూర్తికి శ్రమ పెరుగుతుంది.
వృషభ రాశివారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటారు.
కర్కాటక రాశివారు కొత్త పనుల్లో విజయం సాధిస్తారు.
సింహ రాశివారు గౌరవం కంటే కర్తవ్యాలపై దృష్టి పెట్టాలి.
వివిధ రాశులకు ఆగస్టు 2, 2025 నాటి ఫలాలు
రాశిఫలాలు (దిన ఫలాలు) : 02.07.2025
ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ విశ్వావసునామ
మాసం: శ్రావణ మాసం : శనివారం, తిథి : శు. అష్టమి, నక్షత్రం : విశాఖ
మేష రాశి వారు అన్నిటా పునరాలోచనలు తప్పనిసరిగా చేయండి. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఖర్చులు, శ్రమ ఒకింత ఎక్కువగా ఉంటాయి. అధికారులచే ఒత్తిడులు ఉంటాయి. నిర్లక్ష్యంగా సాగకండి. సాధ్యమైనంతవరకు అనవసర కొనుగోలు లేకుండా జాగ్రత్తపడండి. వృత్తి, వ్యాపారాల్లో ఆశావహ దృక్పథంతో సాగాలి. సంతానంలో సంయమనాలు అవసరం. వారి కోరికలు తీర్చలేకపోవచ్చు.
వృషభ రాశి ఉత్సాహవంతంగా పనులు చేపట్టుకుంటారు. ఆర్థిక, ఆరోగ్యాలు సాధారణంగా ఉంటాయి. నూతన ఎగ్రిమెంట్లు, సొంత బుద్ధికి ప్రాధాన్యతనిచ్చుకోవాలి. సోదరవర్గంతో మాటలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలకు తుది రూపమివ్వగలరు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహాలు పొందుతారు. వ్యాపారులకు టూర్ ప్రోగ్రాములు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో బిజీగా ఉంటారు.
మిశ్రమంగా ఉంటుంది. పూర్తయ్యినవనుకున్న పనులను తిరిగి చేయవలసి రావచ్చు. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు చేపడతారు. తెలిసిన ప్రయోజనాలు పొందగలరు. స్పెక్యులేషన్లకు దూరంగా ఉండాలి. వ్యాపార వ్యవహారాల్లో శ్రమ ఎక్కువగా, ఫలితాలు అంతంతమాత్రంగా ఉంటాయి. విదేశీయాన యత్నాలు ఉపకరించగలవు.
వృత్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు
కర్కాటక రాశి వారు కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తిచేసుకోగలరు. ఆలోచనలను అమలు చేయగలుగుతారు. ఉద్యోగులకు బాధ్యతల మార్పులు వంటివి ఉంటాయి. నూతన స్నేహితులు ఏర్పడతారు. ఆలయ సందర్శనాలు సిద్ధిస్తాయి. వ్యాపారులకు లాభాలు అనుకూలిస్తాయి. వాహన, గృహ సౌఖ్య ఏర్పాట్లకు యత్నిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి.
సింహ రాశి వారు గౌరవం పొందాలనే భావనలకు దూరంగా ఉంటూ కర్తవ్యాలకు తగినట్లుగా వ్యవహరించాలి. వాహన రిపేర్లు, అనారోగ్య సమస్యల వంటి వాటిని ఎదుర్కోవలసి ఉంటుంది. సర్దుబాట్లకు జాగ్రత్తలు అవసరం. మాట తొందరపాటుతనాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగాల్లో అధికారులతో సంయమనాలు అవసరం. విద్యార్థులకు అనుకూల సమయం.
బంధుమిత్రుల సహకారాలు పొందగలరు. సంతానం నుండి శుభవార్తలు ఉంటాయి. వ్యాపారాల్లో నూతన ఆలోచనలు అమలు చేయగలరు. వ్యక్తిగత శ్రమ, అనారోగ్యాలు చికాకుపరచగలవు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అధికారులచే గుర్తింపులు పొందుతారు. ఆలోచనలు కలసివస్తాయి. కాంట్రాక్టులు, ఒప్పందాలు చేసుకోగలరు.
తుల రాశి వారు మానసిక, శారీరక అలసటలున్నా పనులు చేపట్టి పూర్తిచేసుకోగలరు. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. నూతన గ్రంథపఠనములు చేస్తారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. రావలసినవి వసూలవుతాయి. వ్యక్తిగతంగా ఆర్థికవృద్ధి కనిపిస్తుంది. స్థిరాస్తుల చేర్పు–మార్పులకు ప్రాధాన్యతనిచ్చుకుంటారు. ప్రభుత్వ తరహా పనులకు వేచి ఉండే విధానాలు పాటించాలి.
వృశ్చిక రాశి వారు ఆర్థిక, ఆరోగ్య చికాకులను ఎదుర్కోవలసివస్తుంది. శ్రమ పెరుగుతుంది. సోదర, మిత్ర వర్గంతో ఉత్సాహాలు పంచుకుంటారు. క్రయవిక్రయాల విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారాల్లో చెల్లింపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతరులను మీ ఆంతరంగిక విషయాలకు దూరంగా ఉంచండి. కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గౌరవాలు ఆశించి భంగపడకండి.
ఆరోగ్యం, కుటుంబం, మరియు ఇతర ముఖ్య అంశాలు
ధనుస్సు రాశి వారు చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగగలరు. విద్యార్థులకు శుభవార్తలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు మిశ్రమంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఆంతరంగిక విషయాల్లో జాగ్రత్తలు అవసరం.
అదనపు ఆదాయాలు ఉంటాయి. సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నంలో సాగుతారు. అధికారుల సహకారాలు పొందగలరు. స్పెక్యులేషన్లు, ఆర్థిక వ్యవహారాలను అనుకూలంగా పూర్తిచేయగలరు. ప్రభుత్వతరహా వ్యవహారాలను పూర్తిచేసుకుంటారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమర్థత చూపగలుగుతారు. గుర్తింపులు పొందుతారు.
కుంభ రాశి వారు చేపట్టిన పనులను నెమ్మదిగా పూర్తిచేస్తారు. గత సమస్యలకు పరిష్కారాలు వెతుకుతారు. ఆదాయం, అవసరాలు సమర్థవంతంగా ఉంటాయి. ఊహించని ఒత్తిడి వచ్చినా ఆత్మవిశ్వాసంతో అధిగమించగలరు. అధికారులు మీపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరు. విద్యార్థులకు, అవివాహితులకు శుభ పరిణామాలు ఏర్పడవచ్చు.
కొంత నిరుత్సాహం, కొంత ఉత్సాహంతో సాగుతుంది. శ్రమ ఎక్కువగా, ఫలితం తక్కువగా ఉంటుంది. ఉద్యోగాల్లో చికాకులు, ఇంటా బయట విమర్శలు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగి, చెల్లింపులు చేయలేకపోతారు. చేపట్టిన ప్రయాణాలు సౌకర్యవంతంగా సాగుతాయి. మరిన్ని ప్రయోజనాల కోసం ఈశ్వరారాధన తప్పనిసరిగా చేయండి.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ – 9494981000
ఈ రాశి ఫలాలు సూచనలు మాత్రమే. మీ జీవితంలోని నిర్ణయాలకు మీ స్వంత వివేచనను ఉపయోగించండి. శుభ దినం కావాలని కోరుకుంటున్నాము.


