|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కింగ్ నాగార్జున సంచలన నిర్ణయం! 100వ సినిమాపై బిగ్ షాక్ ఇచ్చిన నాగ్! వైరల్ న్యూస్!

Published: 01-02-2026, 6:35 AM
కింగ్ నాగార్జున సంచలన నిర్ణయం! 100వ సినిమాపై బిగ్ షాక్ ఇచ్చిన నాగ్! వైరల్ న్యూస్!
  • కింగ్ నాగార్జున 100వ సినిమాపై భారీ అంచనాలు, యంగ్ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వం!
  • అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై భారీగా నిర్మిస్తున్న నాగార్జున!
  • షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకూడదని మేకర్స్ సంచలన నిర్ణయం!
  • నాగార్జున కెరీర్ లో గుర్తుండిపోయేలా 100వ సినిమాను ప్లాన్ చేస్తున్న మేకర్స్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

నాగార్జున 100వ సినిమా సీక్రెట్స్!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్ లో ఎంతో ముఖ్యమైన అడుగును చాలా జాగ్రత్తగా వేయబోతున్నాడు. ఆయన చాలాప్రస్టేజియస్ గా చేస్తోన్న 100వ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమా నాగార్జున కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలవబోతోంది. అందుకోసం మేకర్స్ ఈ ప్రాజెక్ట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాను తమిళ యంగ్ డైరెక్టర్ రా కార్తీక్ తెరకెక్కిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు.

నాగార్జున 100 వ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా సైలెంట్ గా జరిగిపోతోంది. ఎలాంటి హడావుడి లేకుండా.. కామ్ గా షూటింగ్ జరుపుతున్నారు. చాలా రోజులుగా ఈసినిమాకు సబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నపపటికీ.. బయటకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

చిన్న అప్డేట్ కూడా ఇవ్వకుండా ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. కనీసం పూజా కార్యక్రమాలు కూడా ఎవరికీ తెలియకుండా నిర్వహించారని సమాచారం. షూటింగ్ కూడా పూర్తిగా సీక్రేట్ గానే జరుగుతోందని తెలుస్తోంది.

ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మేకర్స్!

రీసెంట్ గా నాగార్జున 100 సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. షూటింగ్ పూర్తయ్యే వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ కానీ.. స్పెషల్ లుక్ లు కానీ.. లీకేజ్ లు కానీ లేకుండా జాగ్రత్తపడాలని నిర్ణయించుకున్నారట.

అందుకే సోషల్ మీడియాలో గానీ, మీడియా ద్వారా గానీ ఈ సినిమా గురించి సమాచారం బయటకు రావడంలేదు. అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో 100 వ సినిమాకు సబంధించి మంచి అప్ డేట్ కావాలని కోరుకుంటున్నారు.

చాలా కాలంగా హీరోగా సరైన హిట్ లేదు నాగార్జునకు. అందుకే ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు నాగ్. ఈసారి ఎలాగైనా సాలిడ్ సక్సెస్ కొట్టి.. 100 వ సినిమాను మెమరబుల్ గా మార్చుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకే షూటింగ్ పూర్తయ్యే వరకూ ఏ అప్ డేట్ ఇవ్వకూడదని నిర్ణయించకున్నారట.

సైలెంట్ గా షూటింగ్.. కారణం ఇదేనా?

ఒకసారి షూటింగ్ పూర్తయిన తర్వాత విడుదల వరకు వరుసగా అప్డేట్స్ ను అందించి చివరికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే ఇప్పటివరకు నాగార్జున 100వ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా సోషల్ మీడియాలో కనిపించడం లేదు.

ఈ నిర్ణయం గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ లు ఏమీ రాలేదు కానీ. నాగార్జున 100 సినిమాకు సబంధించి అప్ డేట్స్ ఏవీ ఇవ్వకపోవడంపై.. నాగార్జున అభిమానులు మాత్రం కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

ఇతర హీరోల సినిమాలకు తరచూ అప్డేట్స్ వస్తుంటే, తమ అభిమాన హీరో 100వ సినిమా విషయంలో మాత్రం పూర్తిగా మౌనం పాటించడం సరైన నిర్ణయం కాదని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

నాగార్జున 100వ సినిమా గురించి మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.