|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

66 ఏళ్ల వయసులోనూ యంగ్ లుక్ లో నాగార్జున, టాలీవుడ్ కింగ్ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Published: 29-08-2025, 12:51 AM

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 66వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ వయసులోనూ యువతను తలపించే ఆయన యొక్క ఫిట్‌నెస్ మరియు ఆరోగ్య రహస్యాలను తెలుసుకుందాం.

Key Points

1

నాగార్జున యొక్క ఆరోగ్యకరమైన ఆహారం: బ్రౌన్ రైస్, ఆకుకూరలు, చికెన్/చేపలు.

2

రోజూ వ్యాయామం: 35 ఏళ్లుగా వ్యాయామం చేస్తున్నారు.

4

మెంటల్ వెల్ బీయింగ్: మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం.

నాగార్జున ఆహారపు అలవాట్లు

టాలీవుడ్‌లో కింగ్‌, తెలుగు సినిమా మన్మధుడిగా పేరు తెచ్చుకున్నాడు అక్కినేని నాగార్జున. తాజాగా తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ వయస్సులోనూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. అమ్మాయిల మనసు దోచేస్తున్నాడు నాగార్జున. యవ్వనంగా కనిపిస్తూ, యువ హీరోలతో పోటీపడుతున్న నాగార్జున, తన ఫిట్‌నెస్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలోనే కూలీ సినిమాతో స్టైలీష్ విలన్ గా అవతారం ఎత్తిన కింగ్, సైమన్ పాత్రలో అదరగొట్టారు. విలన్ అయినా సరే నాగార్జున లుక్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. తమిళనాట నాగ్ కు ప్రత్యేకంగా అభిమానులు తయారయ్యారు.

60 ఏళ్లు దాటితే ఆనోప్పులు.. ఈ నోప్పులు అంటూ, ముసలితనం ఆలోచనలోనే వచ్చేస్తుంది. కాని 66 లోను 33 లా కనిపిస్తున్న నాగార్జున అసలే ఏం తింటారు? ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. తన ఆరోగ్య రహస్యం ఏంటి?. ఈ విషయాల గురించి పలు సందర్భాల్లో నాగార్జున కొన్ని సీక్రేట్స్ ను వెల్లడించారు. డైట్, వ్యాయామం, మైండ్‌సెట్ విషయంలో క్రమశిక్షణ పాటించడం వల్లే ఈ స్థాయికి వచ్చానని ఆయన అన్నారు. ఇక నాగార్జున ఫిట్‌నెస్ రొటీన్, డైట్ వివరాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది.

డైలీ లైఫ్ స్టైల్ లో నాగార్జున ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటారు. రోజూ భోజనం చేస్తారుగానీ వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటారు. భోజనంలో తప్పనిసరిగా మూడు రకాల ఆకు కూరలు ఉండేలా చూసుకుంటారు. అదేవిధంగా చికెన్ లేదా చేపలు కూడా ఆహారంలో భాగమవుతాయి. ప్రోటీన్, కార్బొహైడ్రేట్లు, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఉన్న బ్యాలెన్స్‌డ్ డైట్‌ను పాటిస్తారు.

వ్యాయామం మరియు ఫిట్‌నెస్ రొటీన్

నాగార్జున తక్కువ మొత్తంలో తిన్నా, లిమిటెడ్‌గా స్వీట్స్ తీసుకోవడం, డిన్నర్‌ను చాలా త్వరగా పూర్తి చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అలాగే, పెరుగు కూడా రోజూ ఆహారంలో తీసుకుంటారు. వయస్సు పెరిగే కొద్దీ కొన్ని ఆహార పదార్థాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని, ఆ విషయంలో నిపుణుల సలహా మేరకు ముందడుగు వేస్తానని ఆయన ఎప్పుడూ అంటుంటారు.

ఆహారాన్ని సరిగా తీసుకోవాలంటే వ్యాయామం తప్పనిసరని నాగార్జున చెబుతారు. ప్రతి రోజు ఉదయాన్నే వ్యాయామం చేయడం తన శరీరానికి మెటబాలిజాన్ని మెరుగుపరచుతుందని అభిప్రాయపడతారు. గత 35 ఏళ్లుగా వ్యాయామం తన లైఫ్ స్టైల్ లో భాగం అయ్యిందని ఆయన అన్నారు. అంతే కాదు సాధ్యమైన రోజుల్లో రన్నింగ్ లేదా స్విమ్మింగ్‌ అయినా తప్పనిసరిగా చేస్తానని నాగార్జున ఓ సందర్భంలో తెలిపారు.

మానసిక ఆరోగ్యం కూడా కీలకం

జీవనశైలి మరియు మానసిక ఆరోగ్యం

నాగార్జున అసలైన ఆరోగ్య రహస్యం గురించి మాట్లాడుతూ “ఎటువంటి విషయం గురించి ఎక్కువగా ఆలోచించను. జరిగే దాన్ని జరగనివ్వాలి. అలా ఆలోచించకపోవడం వల్ల స్ట్రెస్ తక్కువగా ఉంటుంది” ఈ విషయాన్ని తన తండ్రి నాగేశ్వరావు దగ్గర నుంచి నేర్చుకున్నానని నాగార్జున అన్నారు. ఈ విషయాన్ని కూలీ ఆడియో ఫంక్షన్ లో స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్ వెల్లడించారు. ప్రశాంతమైన మైండ్‌సెట్‌తో జీవితం ఆనందంగా ఉంటుందని నాగార్జున అభిప్రాయపడ్డారు. ఫ్యామిలీ జీన్స్ కూడా తనకి హెల్ప్ అయ్యాయని ‘కూలీ’ ప్రమోషన్లలో తెలిపారు.

నాగార్జున 66 ఏళ్ల వయస్సులోనూ ఇలా ఆరోగ్యంగా ఉండేందుకు కారణం క్రమశిక్షణ, సరైన డైట్, వ్యాయామం తో పాటు ఆరోగ్యకరమైన ఆలోచన విధానం. ఆయన లైఫ్‌స్టైల్ స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది ఆయన అభిమానులు తమ జీవితాల్లో మార్పులు చేసుకున్నారు.

నాగార్జున యొక్క ఆరోగ్య రహస్యం క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన ఆహారం, మరియు నియమబద్ధమైన వ్యాయామం. వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అని ఆయన నిరూపించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.