|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Nagarjuna: నేను అలా మాట్లాడలేదు.. కానీ మీరేమో

Published: 22-06-2025, 9:46 PM
Nagarjuna: నేను అలా మాట్లాడలేదు.. కానీ మీరేమో

‘కుబేర’ సినిమా విడుదల తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున సినిమాపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఆయన తన వ్యాఖ్యలకు స్పష్టతనిచ్చారు.

Key Points

1

కుబేర సినిమా హిట్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

2

నాగార్జున తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు.

4

ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన కుబేర సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.

కుబేర సినిమా విజయం

‘కుబేర’ సినిమా వచ్చింది. హిట్ టాక్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కువమంది హీరోగా ధనుష్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలానే కీలక పాత్రలో కనిపించిన నాగార్జునని కూడా ప్రశంసిస్తున్నారు. అయితే నాగ్.. ఈ మూవీ రిలీజ్‌కి ముందు ఒకలా మాట్లాడి తర్వాత మరోలా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇవి నాగ్ చెవిన కూడా పడ్డాయి. ఇప్పుడు తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

‘కుబేర’ సక్సెస్ మీట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో మాట్లాడిన నాగార్జున.. ‘సినిమా విడుదలకు ముందు శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు. ఇప్పుడేమో నా సినిమా అంటున్నాడు అని కొన్ని మీమ్స్ కనిపించాయి. కొన్ని వెబ్‌సైట్స్‌లో వార్తలు కూడా వచ్చాయి. ఇది దేవా(ధనుష్ పాత్ర పేరు) సినిమా. ఇది దీపక్(నాగ్ పాత్ర పేరు) సినిమా. ఇది సమీర(రష్మిక) సినిమా. అన్నింటికీ మించి ఇది శేఖర్ కమ్ముల సినిమా’ అని నాగ్ చెప్పుకొచ్చారు.

నాగార్జున వ్యాఖ్యలపై స్పష్టత

దీనంతటికి కారణం నాగ్ మాటలే. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఇది శేఖర్ కమ్ముల మూవీ అని చెప్పారు. రిలీజ్ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతున్న టైంలో తన పాత్ర మెయిన్ అని, దాంతో తానే హీరో అని నాగ్ అన్నారు. ఇది నా సినిమా కూడా అన్నారు. దీంతో ముందు ఇలా అన్నారు తర్వాత ఇలా అన్నారు అని పలు తమిళ క్రిటిక్స్ విమర్శలు చేశారు. ధనుష్‌ని నాగ్ తక్కువ చేసేలా మాట్లాడుతున్నాడని ట్రోల్ చేశారు. ఇప్పుడు నాగ్ తన కామెంట్స్‌తో వాటికి చెక్ పెట్టేశాడని చెప్పొచ్చు.

సోషల్ మీడియాలో విమర్శలు

ధనుష్,నాగ్, రష్మిక.. ఇలా స్టార్స్ నటించిన ‘కుబేర’కు రిలీజ్‌కి ముందు ఓ మాదిరి బజ్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే పాజిటివ్ టాక్ వచ్చిందో థియేటర్లు హౌస్‪‌ఫుల్స్ అవుతున్నాయి. చాలారోజుల నుంచి మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులు.. దీన్ని చూస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల్లో రూ.50 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఓవర్సీస్‌లోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

‘కుబేర’ సినిమా విజయవంతంగా దూసుకుపోతోంది. నాగార్జున తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చి విమర్శలకు చెక్ పెట్టారు. ధనుష్, రష్మికతో కలిసి నాగార్జున నటన ప్రేక్షకులను అలరిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.