|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాగార్జున డ్రీమ్ రోల్ ఇదేనా? రాజమౌళికి నాగ్ అదిరిపోయే ఆఫర్! వైరల్ న్యూస్!

Published: 24-03-2026, 7:35 AM
నాగార్జున డ్రీమ్ రోల్ ఇదేనా? రాజమౌళికి నాగ్ అదిరిపోయే ఆఫర్! వైరల్ న్యూస్!
  • నాగార్జున మనసులోని మాట: మహాభారతంలో నటించాలనే కోరిక! ఏ పాత్రలోనైనా పరవాలేదంటున్న మన్మధుడు!
  • రాజమౌళి దర్శకత్వంలో పౌరాణిక చిత్రం వస్తే నటించడానికి సిద్ధం! నాగ్ కల నెరవేరుతుందో లేదో చూడాలి మరి!
  • ఎన్టీఆర్, తన తండ్రి నటించిన పౌరాణిక చిత్రాలు చూస్తూ పెరిగానన్న నాగార్జున! అలాంటి పాత్ర కోసం ఎదురుచూపులు!
  • వరుణాసి తర్వాత రాజమౌళి మహాభారతం తీస్తాడేమోనని ఆశగా ఎదురుచూస్తున్న నాగార్జున! అభిమానుల్లో ఉత్కంఠ!

కింగ్ నాగార్జున గురించి ఒక అదిరిపోయే న్యూస్ మీకోసం. ఆయన మనసులో ఎప్పటినుంచో ఒక కోరిక ఉందట. ఆ కోరిక ఏమిటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

నాగార్జున మనసులోని కోరిక ఇదే!

నాగార్జునపై మన్మథుడు అనే ట్యాగ్‌ పడింది. కానీ ఆయన అన్నిరకాల పాత్రలు పోషించారు. ఇంకా చెప్పాలంటే ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచారు. `మన్మథుడు` చేసిన ఆయనే శ్రీరామదాసు మూవీ చేశారు. `అన్నమయ్య` చిత్రాలు చేసి మెప్పించారు. బ్లాక్‌ బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నారు. కమర్షియల్ సినిమాలు ఆడటం లేదు. దీంతో విభిన్నమైన మూవీస్‌ వైపు ఫోకస్‌ చేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలు చేస్తున్నారు.

నాగార్జున ప్రస్తుతం తన 100వ చిత్రం చేస్తున్నారు. `నాగ్‌ 100` పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. సంక్రాంతి టార్గెట్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఇదిలా ఉంటే నాగార్జున ఇటీవల క్రేజీగా టర్న్ తీసుకున్నారు. ఆయన విలన్‌గానూ చేయడానికి రెడీ అయ్యారు. `కూలీ` చిత్రంలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇది ఆడలేదు. అలాగే `కుబేరా` మూవీలో కీలక పాత్రలో నటించారు. ఇది ఫర్వాలేదనిపించింది.

రాజమౌళికి నాగ్ బంపర్ ఆఫర్!

అంతేకాదు గతంలో `బ్రహ్మాస్త్ర`లోనూ కీలక పాత్రలో నటించారు. ఆయన నంది అస్త్రగా కనిపించారు. ఈ క్రమంలో నాగార్జునకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. తన డ్రీమ్‌ రోల్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగ్‌కి మైథాలజీ రోల్స్ చేయాలని ఉందట. అందులో భాగంగానే మహాభారతాన్ని సినిమాగా చేస్తే అందులో నటించాలని ఉందని తెలిపారు.

`పౌరాణిక సినిమా చేయాలని ఉంది. ఎన్టీఆర్‌ గారు కృష్ణుడు, అర్జునుడుగా నటించారు. కానీ ఇంకా చాలా పౌరాణిక పాత్రలు చాలా ఉన్నాయి. వాటిలో ఏదో ఒక పాత్రని తీసుకొని ఎవరైనా పక్కా కథతో వస్తే నేను నటించడానికి సిద్ధంగా ఉన్నాను` అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరో ఇంటర్వ్యూలో ఆయన చెబుతూ, ఎన్టీఆర్‌, నాన్నగారు చేసిన పౌరాణికాలు చూస్తూ పెరిగాను. అలాంటి సినిమాలు ఎవరైనా చేస్తే నటించాలని ఉంది. ఇప్పుడు రాజమౌళి పెద్ద బడ్జెట్‌ చిత్రాలు చేస్తున్నారు. అలా ఎవరైనా మహాభారతం లాంటివి తీస్తే చేయాలని ఉంది. మహాభారతంలో ఏ పాత్ర అయినా చేయాలని ఉంది. ఇలాంటి సినిమా అంటే ముగ్గురు, నలుగురు హీరోలు కావాలి, ఎవరైనా ప్లాన్‌ చేస్తే బాగుంటుంది` అని చెప్పారు నాగార్జున. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

మహాభారతంలో ఏ పాత్రకైనా సిద్ధం!

ప్రస్తుతం తెలుగులో మైథాలజీ సినిమాలు చేసే వారిలో రాజమౌళి ముందు వరుసలో ఉన్నారు. `బాహుబలి` చిత్రంతో ఆ జోనర్‌ని టచ్‌ చేశారు. ఇప్పుడు ఆయన `వారణాసి` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో రామాయణం ఎపిసోడ్‌ని తీస్తున్నారు. మహేష్‌ బాబు రాముడిగా కనిపించబోతున్నారు. ఆ తర్వాత మహాభారతం చేయబోతున్నారు. మహాభారతం చేయాలనేది తన డ్రీమ్‌ అని వెల్లడించారు రాజమౌళి. మరి నాగార్జున ఎప్పుడో రాజమౌళి కి హింట్‌ ఇచ్చాడు. కానీ ఇప్పుడు నాగార్జునని పౌరాణిక పాత్రల్లో చూపించడమనేది రాజమౌళి చేతుల్లో ఉందని చెప్పొచ్చు. మరి ఆయన ఏం చేస్తాడో చూడాలి.

నాగార్జున డ్రీమ్ రోల్ గురించి తెలుసుకున్నారు కదా. రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.