|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కినేని నాగార్జున రియల్ హీరో.. CM రేవంత్ ప్రశంసలు

Published: 28-06-2025, 9:45 AM
అక్కినేని నాగార్జున రియల్ హీరో.. CM రేవంత్ ప్రశంసలు

టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున చేసిన భూదానంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. నాగార్జునను ‘రియల్ హీరో’ అని అభివర్ణించారు రేవంత్ రెడ్డి.

Key Points

1

CM రేవంత్ రెడ్డి అక్కినేని నాగార్జునను 'రియల్ హీరో' అని అభినందించారు.

2

నాగార్జున ఎన్ కన్వెన్షన్‌లో రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి దానం చేశారు.

4

రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఆక్రమణలను తొలగిస్తున్నట్లు తెలిపారు.

నాగార్జున భూదానం

టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రశంసలు కురిపించారు. శనివారం ఔటర్ రింగు రోడ్డు నుంచి కొండాపూర్ వరకు నిర్మించిన పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అనేక నాలాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయని ఆరోపించారు. హైడ్రా ద్వారా ఆక్రమణలు తొలగిస్తున్నామని చెప్పారు. ఎన్ కన్వెన్షన్‌(N Convention)లో రెండు ఎకరాల భూమిని సినీ నటుడు అక్కినేని నాగార్జున స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారని తెలిపారు. భూమిని అప్పగించిన నాగార్జున రియల్ హీరో అని కొనియాడారు.

హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, ట్యోక్యో వంటి నగరాలతో పోటీ పడేలా చేయాలన్నదే తమ తాపత్రయం అని అన్నారు. ఈ యజ్ఞానికి ఎంతమంది రాక్షసులు అడ్డుపడినా చేసి తీరుతామని ప్రకటించారు. తమ ప్రభుత్వ ప్రయత్నానికి జీహెచ్ఎంసీ ప్రజాప్రతినిధులు అండగా నిలిచేందుకు ముందుకువచ్చారని.. మీరే ఈ ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మా ప్రభుత్వానికి ఎన్నికలప్పుడే రాజకీయాలు అని.. మిగతా సమయాల్లో ప్రజల అభివృద్ధే బాధ్యతగా భావిస్తున్నామన్నారు. మూడు లేయర్లుగా తెలంగాణను విభజిస్తున్నాం. రాబోయే 100 రోజుల్లో కోర్ అర్భన్ రీజన్‌కు సంబంధించి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఒక ప్రణాళిక లేకపోవడం వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరిగింది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నుంచి పాఠాలు నేర్చుకుని మనం ఒక ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. రాజకీయ ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్లను ప్రజలు గమనించాలని.. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు.

రేవంత్ రెడ్డి ప్రశంసలు

హైదరాబాద్ అభివృద్ధి

అక్కినేని నాగార్జున సేవా గుణాన్ని CM రేవంత్ రెడ్డి ప్రశంసించడం సంతోషదాయకం. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.