|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్విస్ట్‌ ఇచ్చిన నాగవంశీ.. త్రివిక్రమ్‌ సినిమాలపై ప్రకటన

Published: 12-06-2025, 4:28 AM

టాలీవుడ్ లో త్రివిక్రమ్ సినిమాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలో, నిర్మాత నాగవంశీ కీలక ప్రకటన చేశారు. వెంకటేష్, ఎన్టీఆర్ తో రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నట్లు తెలిపారు.

Key Points

1

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్, ఎన్టీఆర్ తో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి.

2

నాగవంశీ వేరే హీరోలతో త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించిన వార్తలను ఖండించారు.

3

ఎన్టీఆర్ 'మోస్ట్ పవర్ ఫుల్ గాడ్' పాత్రలో నటిస్తున్నారని నాగవంశీ ప్రకటించారు.

4

రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానులకు నాగవంశీ ట్విస్ట్ ఇచ్చినట్లు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

త్రివిక్రమ్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ

రెండురోజుల నుంచి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) పేరు టాలీవుడ్‌లో వైరల్‌ అవుతుంది. ఆయన చేయబోయే సినిమాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న వేళ నిర్మాత నాగవంశీ ఒక పోస్ట్‌తో అన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు. త్రివిక్రమ్‌ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. వాటిలో ఒకటి విక్టరీ వెంకటేశ్‌తో చేస్తారని చెప్పుకొచ్చారు. మరొకటి ఎన్టీఆర్‌తో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఆయన చేతిలో ఈ రెండు తప్పా ఎలాంటి ప్రాజెక్ట్‌లు లేవన్నారు. వేరే హీరోలతో త్రివిక్రమ్‌చేస్తున్నారని వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని తేల్చేశారు. త్రివిక్రమ్‌కు సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్‌ ఫైనల్‌ అయితే స్వయంగా తానే ప్రకటిస్తానని  నాగవంశీ తెలిపారు.

మోస్ట్‌ పవర్‌ఫుల్‌ గాడ్‌ పాత్రలో తారక్‌ అన్న నటిస్తున్నారంటూ ఇప్పటికే నాగవంశీ ఒక పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా తారక్‌ నటిస్తున్నారని టాక్‌. ప్రస్తుతం ఎన్టీఆర్‌ చేతిలో వార్‌2, ప్రశాంత్ నీల్‌ ప్రాజెక్ట్‌, దేవర్‌2 సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకు నాగవంశీ ట్విస్ట్‌ ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

నాగవంశీ ప్రకటనతో కలకలం

ఎన్టీఆర్ పాత్రపై ఆసక్తికర విషయం

చివరకు నాగవంశీ తన ప్రకటనతో త్రివిక్రమ్ సినిమాలపై అనుమానాలకు తెరదించారు. వెంకటేష్, ఎన్టీఆర్ ప్రాజెక్టులతో పాటు, ఎన్టీఆర్ పాత్రపై చర్చ జరుగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.