|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య బాబు ఆరోగ్యంపై సంచలన ప్రకటన! అభిమానుల్లో హై టెన్షన్!

Published: 22-07-2026, 6:35 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. NBK111 షూటింగ్‌లో గాయపడిన బాలయ్య బాబుకు సంబంధించిన తాజా వైద్య నివేదిక ఇప్పుడు సంచలనం రేపుతోంది. అసలు ఏం జరిగింది? డాక్టర్లు ఏం చెప్పారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం!

Key Points

1

NBK111 షూటింగ్‌లో నటసింహం బాలకృష్ణ మోకాలికి తీవ్ర గాయం, అభిమానుల్లో ఆందోళన.

2

హైదరాబాద్ AIG ఆసుపత్రికి తరలింపు, నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షణలో బాలయ్య.

4

బాలయ్య ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, త్వరలో సర్జరీపై నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడి.

NBK111 షూటింగ్‌లో బాలయ్యకు గాయం

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ప్రతిష్టాత్మక ‘NBK111’ చిత్రం షూటింగ్ కాకినాడ పోర్ట్ ఏరియాలో జరుగుతుండగా, అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో బాలయ్య గాయపడ్డారు. ఈ షూటింగ్‌లో బాలయ్య మోకాలికి గాయమైందని, దానికి ఒక చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉందని దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం తదుపరి వైద్యం, సర్జరీ కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ ఆసుపత్రి డాక్టర్లు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు.

ఆయనను పరీక్షించాక ఎడమ మోకాలి దగ్గర రక్తం గడ్డకట్టి, వాపు వచ్చిందని వెల్లడించారు. మోకాలి కండరం ఏమైనా చిరిగిందేమో అని అనుమానిస్తున్నట్లు.. ప్రస్తుతం ఆర్థోపెడిక్ డాక్టర్లు ఆయనను దగ్గరుండి చూసుకుంటున్నారని అన్నారు. అంతేకాకుండా రకరకాల మెడికల్ టెస్టులు కూడా చేస్తున్నారని తెలిపారు. బాలకృష్ణ పాత హెల్త్ రికార్డులను కూడా చూసి, ఆయనకు ఏ ఇబ్బంది లేకుండా సురక్షితమైన వైద్యం అందించడానికి వేర్వేరు విభాగాల డాక్టర్ల టీమ్ ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక ఆపరేషన్ ఎప్పుడు చేయాలి, ఎలాంటి వైద్యం అందించాలనేది నిర్ణయిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ వార్త తెలిసిన అభిమానులు బాలయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఆసుపత్రిలో బాలయ్య.. డాక్టర్ల కీలక ప్రకటన

అభిమానుల ఆందోళన.. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి

నటసింహం బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని తాజా అప్‌డేట్స్‌ కోసం మా ఛానెల్‌ను చూస్తూనే ఉండండి. ఆపరేషన్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.