
📌 Key Points
- నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ‘ఆదిత్య 999 మాక్స్’ తో హీరోగా పరిచయం కానున్నాడు.
- మోక్షజ్ఞ మొదటి సినిమా ‘ఆదిత్య 369’ కి సీక్వెల్‌గా రానుంది, పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.
- మొదటి సినిమాలోనే కన్నడ స్టార్ ఉపేంద్ర మెయిన్ విలన్‌గా నటించనున్నాడని వార్తలు.
- క్రిష్ దర్శకత్వంలో, భారీ గ్రాఫిక్స్ తో పాన్ ఇండియా స్థాయిలో 2026 ఉగాదికి సినిమా ప్రారంభం కానుందని టాక్.
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. బాలకృష్ణ ప్రకటించిన ‘ఆదిత్య 999 మాక్స్’ చిత్రంతో మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్నాడు. ఈ మొదటి సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర మెయిన్ విలన్‌గా నటించనుండగా, ప్రాజెక్ట్ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలకృష్ణ కీలక ప్రకటన
Nandamuri Mokshagna: నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు వినిపించాయి. రీసెంట్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఒక సినిమా కూడా ఒకే అయ్యింది. దానికి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. దీంతో, తాము చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారసుడి ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ, అనూహ్యంగా ఈ సినిమా మొదలవకుండానే ఆగిపోయింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Manoj Bajpayee; బాలీవుడ్ లో అభద్రతా భావం ఎక్కువ.. ఒకరిని ఒకరు ప్రశంసించుకోరు.. ఇక్కడ ఎలా ఉంటుందంటే..
మొదటి సినిమానే ఉపేంద్రతో: భారీ విలన్
దీంతో మరోసారి డిజప్పాయింట్ అయిన ఫ్యాన్స్ తాజాగా బాలకృష్ణ చేసిన కామెంట్స్ తో ఊపిరి పీల్చుకున్నారు. రీసెంట్ గా గోవా ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొన్న బాలకృష్ణ తన వారసుడు మోక్షాజ్ఞ(Nandamuri Mokshagna) ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ఆదిత్య 369 సీక్వెల్ గా ఆదిత్య 999 మాక్స్ రాబోతుంది అని ప్రకటించాడు. ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడని చెప్పుకోచ్చాడు. అలాగే ప్రస్తుతం ఈ సీక్వెల్ కి సంబందించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని కూడా చెప్పాడు. దీంతో, నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.
క్రిష్ దర్శకత్వం, 2026 ఉగాదికి ప్రారంభం?
తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే, మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్న మొదటి సినిమాలో మెయిన్ విలన్ గా కన్నడ స్టార్ ఉపేంద్రను ఫిక్స్ చేశారట. ఆయన పాత్రకు సంబంధించి చర్చలు కూడా ఇప్పటికే జరిగాయని టాక్. ఇక ఆయన పాత్ర కూడా చాలా విచిత్రంగా ఉంటుందని టాక్ నడుస్తోంది. మరి మొదటి సినిమాకే ఉపేంద్ర లాంటి నటుడితో చేయడం అంటే మాములు విషయం కాదు. మరి ఆయన ముందు మోక్షజ్ఞ ఎలా చేస్తాడు అనేది చూడాలి. ఇక భారీ గ్రాఫిక్స్ తో, భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాను క్రిష్ తెరకెక్కిస్తాడనే టాక్ కూడా నడుస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమా 2026 ఉగాదికి మొదలుకానుందని సమాచారం.
మోక్షజ్ఞ మొదటి సినిమానే ఉపేంద్రతో, ‘ఆదిత్య 369’ సీక్వెల్‌గా వస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నందమూరి అభిమానులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని ఆశిద్దాం.


