
వంద కోట్ల క్లబ్‌లో చేరిన ‘హిట్3’ సినిమాపై నాని అభిమాని ఒకరు కాపీరైట్ కేసు వేశారు. గతంలో రాసిన కథలను కాపీ కొట్టారని ఆమె ఆరోపిస్తున్నారు. మద్రాస్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.
Key Points
నాని అభిమాని 'హిట్ 3' మేకర్స్ పై కాపీరైట్ కేసు వేశారు.
ఏజెంట్ 11, ఏజెంట్ V కథలను కాపీ కొట్టారని ఆరోపణ.
మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు.
గతంలో కూడా దర్శకుడు శైలేష్ కొలనుపై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.
అభిమాని దాఖలు చేసిన పిటిషన్
‘హిట్3: ది థర్డ్ కేస్’ హీరో నాని కెరీర్‌లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయన సినిమా.. అయితే, ఈ సినిమా స్టోరీని కాపీ కొట్టారంటూ నాని అభిమాని మద్రాస్ కోర్టులో కేసు వేసింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ మూవీలో హింస ఎక్కువగానే ఉందని టాక్ వచ్చినప్పటికీ భారీ విజయాన్ని అందుకుంది.
హిట్1, హిట్2 చిత్రాలకు సీక్వెల్‌గా హిట్ 3 మూవీని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించారు. అయితే, స్టోరీని కాపీ కొట్టారంటూ మహిళా రచయిత విమల్ సోనీ (Sonia Vimal) మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె నానికి వీరాభిమాని అని కూడా చెప్పారు. గతంలో తాను రాసిన ఏజెంట్ 11, ఏజెంట్ V కథల నుంచి కాపీ కొట్టి హిట్ 3 సినిమా తీశారని ఆమె తెలిపారు. దీంతో హిట్ 3 సినిమా మేకర్స్ పై మద్రాస్ హైకోర్టులో కాపీ రైట్ కేసు వేశారు. ఈ క్రమంలో తను రచించిన ఒరిజినల్ కాపీని కోర్టుకు సమర్పించారు. గతంలో కూడా దర్శకుడు శైలేష్ కొలనుపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. వెంకటేశ్‌తో తాను దర్శకత్వం వహించిన ‘సైంథవ్’ సినిమా కథ కూడా కాపీ కొట్టారని అప్పట్లో విమర్శలు వచ్చాయి.
కాపీరైట్ ఆరోపణలు
హైకోర్టు విచారణ
హిట్ 3 సినిమాపై వచ్చిన కాపీరైట్ కేసు హైకోర్టులో విచారణకు వెళ్తుండగా, సినిమా మేకర్స్ పై ఒత్తిడి పెరిగింది. ఈ కేసు తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.


