
హిట్ 3 సినిమా షూటింగ్ సమయంలో నానికి తీవ్రమైన గాయం అయింది. శ్రీనగర్ లో జరిగిన ఫైట్ సీన్ షూటింగ్ లో కెమెరా నాని తలకు తగిలింది. రక్తం కారినప్పటికీ, నాని షూటింగ్ కొనసాగించారు. దర్శకుడు శైలేష్ కొలను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Key Points
హిట్ 3 షూటింగ్ సమయంలో నాని తలకు గాయం.
రక్తం కారినప్పటికీ, షూటింగ్‌ను ఆపలేదు నాని.
శైలేష్ కొలను నాని డెడికేషన్‌ను ప్రశంసించారు.
గాయం గురించి శైలేష్ కొలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
షూటింగ్‌లో నానికి తల గాయం
Sailesh Kolanu : శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన హిట్ 3 సినిమా ఇటీవల మే 1 న రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లో 82 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని మూవీ యూనిట్ ప్రకటిచింది. త్వరలో ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ దాటనుంది. ఈ సినిమాలో మొదటిసారి నాని బాగా వైలెంట్ గా కనిపించాడు. ఈ సినిమా కోసం నాని బాగా కష్టపడ్డాడు.
ఇటీవల శైలేష్ కొలను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీనగర్ లో ఓ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు కెమెరా నాని తలకు తగిలి చీలి రక్తం కారింది. అప్పుడు రక్తం గడ్డ కట్టేలా చేసి షూటింగ్ పూర్తిచేసాడు. షూట్ అవ్వగానే ఢిల్లీకి నైట్ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని ఉదయాన్నే మళ్ళీ శ్రీనగర్ వచ్చి అక్కడ్నుంచి షూటింగ్ లొకేషన్ కి వచ్చాడు. నాని డెడికేషన్ అలా ఉంటుంది అని చెప్పాడు.
రక్తం కారినా షూటింగ్ కొనసాగింపు
తాజాగా ఆ గాయం గురించి శైలేష్ కొలను తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. నాని ఓ సీన్ లో కొంతమందిని కొడుతూ ఉంటాడు. అప్పుడు సడెన్ గా కెమెరాకు నాని తల తగిలడంతో నాని నుదురు మీద చీలుకుపోయి రక్తం వచ్చింది. దానికి సంబంధించిన షూట్ విజువల్స్ ని శైలేష్ కొలను పోస్ట్ చేసాడు. నాని నుదురు మీద అయిన గాయాల ఫోటోలను కూడా పోస్ట్ చేసాడు.
శైలేష్ కొలను సోషల్ మీడియా పోస్ట్
ఈ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ.. నేను చెప్పింది దీని గురించే. ఆ దెబ్బ తగిలిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ షాట్ కి రెడీ అయిపోయాడు నాని. ప్రపంచంలో ఉన్న గౌరవం అంతా ఇతనికే దక్కాలి. సినిమా పట్ల మీకు ఉన్న ప్రేమ ఒక వ్యాధి లాంటిది. మీతో పాటు నన్ను ప్రయాణించేలా చేసినందుకు ధన్యవాదాలు. హిట్ 3 నా జర్నీలో ఎప్పటికి గుర్తుండిపోతుంది. లవ్ యు అంటూ నాని పై తనకున్న ప్రేమను రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా సినిమా అంటే నానికి ఇంత పిచ్చా అని ఫ్యాన్స్, నెటిజన్లు మరోసారి అభినందిస్తున్నారు.
నాని ప్రొఫెషనలిజం, సినిమా పట్ల అంకితభావం అందరినీ ఆకట్టుకుంది. శైలేష్ కొలను పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిట్ 3 సినిమా విజయం సాధించడానికి నాని కృషి ప్రధాన కారణం.


