
నేచురల్ స్టార్ నాని ‘ప్యారడైజ్’ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ భారీ యాక్షన్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నాని మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Key Points
నాని 'ప్యారడైజ్' సినిమా షూటింగ్ నుంచి యాక్షన్ సీన్ వీడియో వైరల్!
భారీ యాక్షన్ సీక్వెన్స్ లో నాని మాస్ అవతారం ఆకట్టుకుంటుంది.
జడలతో నాని లుక్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.
2026 మార్చి 26న ప్యారడైజ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్యారడైజ్ యాక్షన్ సీన్ వీడియో వైరల్
కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. వరుస హిట్లతో తన రేంజ్ ను పెంచుకుంటున్నారు. ఇప్పుడిక ‘ప్యారడైజ్’ అంటూ తనలోని వేరే లెవల్ మాస్ అవతారాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. నాని అప్ కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ అయిన ప్యారడైజ్ పై అంచనాలు క్రమంగా పెరుగుతున్నారు. ఇప్పుడు మూవీ షూటింగ్ నుంచి ఓ క్రేజీ వీడియో షేర్ చేశాడు నాని.
ప్యారడైజ్ మూవీ ఫుల్ మాస్ యాక్షన్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జడలతో నాని డిఫరెంట్ గా ఉన్నాడు. ఇప్పుడీ మూవీ నుంచి యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నాని. ఈ వీడియో అదిరిపోయింది. భారీ యాక్షన్ సీక్వెన్స్ ను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎలా తెరకెక్కిస్తున్నాడో ఈ వీడియోలో క్లియర్ గా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
జడలతో నాని లుక్
జైలులో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇందులో చాలా మంది గుంపుగా నాని మీద అటాక్ చేసేందుకు వస్తారు. వీళ్లతో నాని ఫైట్ ప్యారడైజ్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే అవకాశముంది.
‘‘ఎప్పుడైతే హీరో ఒకటి, రెండు అంటూ డిప్స్ తీస్తుంటాడో.. అక్కడి నుంచి వీళ్లందరూ రచ్చ రచ్చ చేసి పారదొబ్బుతారు. 499 అని సౌండ్ వినపడుతుంది అంతే. ఇది సర్రుమని రైజ్ అవుతది. వాడి జడలను మట్టుకుంటే వాడికి సర్రుమంటది’’ అని డైరెక్టర్ శ్రీకాంత్ చెప్పే మాటలు వీడియోలో వినిపించి హైప్ మరింత పెంచేశాయి. కడుపు మాడిన కాకుల కథ అంటూ ఈ మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ ఇప్పటికే అదరగొట్టింది.
2026 మార్చి 26న విడుదల
ప్యారడైజ్ సినిమాపై హైప్ వేరే లెవల్ కు చేరుకుంటుంది. ‘‘మేం అందరం లోపలికి వెళ్లాం. అందరం బయటకు వెళ్లేందుకు రెడీగా ఉన్నాం. ఇంటెన్స్ సీన్ కంప్లీట్ అయింది. తర్వాతి షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నాం’’ అని ఎక్స్ లో ఈ వీడియో పోస్టు చేస్తూ నాని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
నాని అప్ కమింగ్ మూవీ ప్యారడైజ్ 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్సివ్ మాస్ డ్రామాగా ప్యారడైజ్ తెరకెక్కుతుంది.
ప్యారడైజ్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. నాని యొక్క మాస్ యాక్షన్ అవతారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. 2026 మార్చి 26న విడుదల తేదీని ఎదురు చూస్తున్నారు.
