|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాని ప్రొడక్షన్లో నితిన్-రుక్మిణి వసంత్ మాస్ కాంబో.. ‘దండోరా’ డైరెక్టర్కు అదిరిపోయే ఆఫర్!

Published: 11-07-2026, 8:20 AM
నాని ప్రొడక్షన్లో నితిన్-రుక్మిణి వసంత్ మాస్ కాంబో.. ‘దండోరా’ డైరెక్టర్కు అదిరిపోయే ఆఫర్!
  • నాని నిర్మాణంలో నితిన్-రుక్మిణి వసంత్ కాంబో సినిమా
  • దండోరా ఫేమ్ దర్శకుడు దర్శకత్వం
  • పాన్-ఇండియా లెవల్లో భారీ చిత్రంగా ప్లాన్
  • త్వరలో అధికారిక ప్రకటన విడుదల

టాలీవుడ్లో మరో సంచలనం రెడీ! నాని నిర్మాణంలో నితిన్-రుక్మిణి వసంత్ జంటగా క్రేజీ కాంబో సినిమా తెరకెక్కనుంది. ‘దండోరా’ దర్శకుడికి ఈ ప్రాజెక్ట్ బంపర్ ఆఫర్గా మారింది.

నాని బ్యానర్లో నితిన్ కొత్త చిత్రం

చిత్ర పరిశ్రమలో విజయాలు, పరాజయాలు సహజం. కానీ, ఫ్లాపులతో సంబంధం లేకుండా కంటెంట్ నమ్మి ముందుకు సాగే హీరోలు, వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే హీరోయిన్లు, విజన్ ఉన్న నిర్మాతలు కలిస్తే.. అక్కడ ఒక అద్భుతమైన సినిమా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఇలాంటి ఒక సరికొత్త అంచనాలు పెంచే క్రేజీ కాంబినేషన్ గురించిన టాక్ బలంగా వినిపిస్తోంది. స్టార్ హీరోగా ఉంటూనే తన ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై ప్రయోగాత్మక చిత్రాలను నిర్మిస్తున్న నేచురల్ స్టార్ నాని .. వరుసగా వైవిధ్యమైన చిత్రాలను లైన్లో పెడుతున్న హీరో నితిన్ , పాన్-ఇండియా క్రేజ్ ఉన్న బ్యూటీ రుక్మిణి వసంత్ జంటగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. * ‘హైదరాబాద్ నా కర్మ భూమి.. చివరి సినిమా కూడా ఇక్కడే చేస్తా’ – స్టేజ్‌పైనే ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే నిర్మాతగానూ నాని సక్సెస్ నాని కేవలం వెండితెరపైనే కాకుండా, నిర్మాతగా కూడా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా, సరికొత్త కథలను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన బ్యానర్‌లో వచ్చిన మొదటి సినిమా ‘అ!’ విమర్శకుల ప్రశంసలతో పాటు రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘హిట్’ ఫ్రాంచైజీ (HIT 1, 2, 3) టాలీవుడ్‌లో క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌కు సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ఇటీవల ప్రియదర్శి ప్రధాన పాత్రలో వచ్చిన ‘కోర్ట్’ సినిమా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి నానికి మరో భారీ విజయాన్ని అందించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా నిర్మిస్తూనే, మరోవైపు నితిన్‌తో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు నాని సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిరుత్సాహపడని నితిన్ హీరో నితిన్ కెరీర్‌లో ‘భీష్మ’ తర్వాత ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘రాబిన్ హుడ్’, ‘తమ్ముడు’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. వరుసగా అరడజను పరాజయాలు ఎదురైనప్పటికీ, నితిన్ ఎక్కడా నిరుత్సాహపడకుండా సరికొత్త కథలతో తన కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ఠ మూవీస్ వంటి పెద్ద బ్యానర్లలో నటిస్తూనే, వి.ఆనంద్, అంజి వంటి భిన్నమైన దర్శకులతో ప్రాజెక్ట్‌లు ఓకే చేశారు. ఇప్పుడు నాని నిర్మాణంలో, సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ చిత్రం నితిన్ కెరీర్‌కు ఒక పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. * అయ్యగారి బాక్సాఫీస్ సునామీ.. పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ ‘లెనిన్’ రికార్డ్ ఓపెనింగ్స్ రుక్మిణి వసంత్ పాన్-ఇండియా క్రేజ్ కన్నడ చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ (తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’) ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రుక్మిణి వసంత్, తన సహజమైన నటనతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె హీరోయిన్‌గా నటించిన కన్నడ విజువల్ వండర్ ‘కాంతార చాప్టర్ 1’ ఏకంగా 800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ మూవీలోనూ ఆమె నటిస్తోంది. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన రుక్మిణి, ఈ చిత్రంలో నితిన్ సరసన కథానాయికగా నటించనుండటం విశేషం. ‘దండోరా’ దర్శకుడికి లక్కీ ఛాన్స్! సమాజంలోని కుల వ్యవస్థ, సామాజిక వివక్ష, గ్రామీణ నేపథ్యంలోని మానవ సంబంధాలను ‘బలగం’ తరహాలో చావు చుట్టూ తిరిగే కథాంశంతో వాస్తవికంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం ‘దండోరా’. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన మురళీకాంత్ దేవాసోత్ తొలి సినిమాతోనే కమర్షియల్ హంగులకు పోకుండా తన ప్రతిభను చాటుకున్నారు. ఈ దర్శకుడి టాలెంట్‌ను గుర్తించిన నాని, నితిన్ – రుక్మిణి వసంత్ కాంబినేషన్ ప్రాజెక్ట్ బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు టాలీవుడ్ సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

రుక్మిణి వసంత్తో రొమాంటిక్ ఎంట్రీ

దండోరా డైరెక్టర్కు భారీ అవకాశం

ఈ క్రేజీ కాంబో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.