
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ తాజా ఇంటర్వ్యూలో తన ఉపవాస అనుభవాలను పంచుకుంది. తొమ్మిది రోజుల పాటు ఉపవాసం చేసినప్పుడు తన ముఖం ఎలా మారుతుందో వివరించింది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే.
Key Points
నర్గీస్ ఫక్రీ తన ఉపవాస అనుభవాలను పంచుకుంది.
ప్రతి ఏడాది రెండుసార్లు తొమ్మిది రోజుల ఉపవాసం ఉంటుందని తెలిపింది.
ఉపవాసం తర్వాత హై ప్రోటీన్ ఆహారం తీసుకుంటుందని వివరించింది.
నర్గీస్ ఫక్రీ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri)‘రాక్ స్టార్’ మూవీతో సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది ఇక అప్పటినుంచి హిందీలో వరుస చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’(Harihara Veeramallu)మూHarihara Veeramalluవీలో కీలక పాత్రలో కనిపించనుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నర్గీస్ ఫక్రీ షాకింగ్ విషయాలు రివీల్ చేసింది. ‘‘నేను ప్రతి ఏడాది రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ఆ సమయంలో నా ముఖం చాలా వికృతంగా మారుతుంది. ఉపవాసం ఉన్న సమయంలో 9 రోజులపాటు ఏమీ తినకుండా ఉపవాసం చేస్తాను.
అలా తొమ్మిది రోజులు ఉపవాసం చేస్తున్న సమయంలో రోజులు ఫుడ్ ఏమీ తినకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగుతాను. ఉపవాసం కంప్లీట్ అయ్యేసరికి నా ముఖంలో చాలా మార్పులు వస్తాయి. తొమ్మిది రోజులు ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం నీళ్లు మాత్రమే తాగుతాను. ఇది చాలా కష్టం. నా ముఖంలో చాలా తేడాలు కనిపిస్తాయి. అలాగే అంతకు ముందే లేనీ గ్లో కనిపిస్తుంది. తొమ్మిది రోజుల ఉపవాసం ముగిసిన తర్వాత కచ్చితంగా హై ప్రోటీన్స్ ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను. ఈ హై ప్రోటీన్స్ ఉండే ఆహారం తినడం వల్ల మళ్లీ నేను ఆరోగ్యంగా మారిపోతాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు పెళ్లి కోసమేనా? అని పలు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
తొమ్మిది రోజుల ఉపవాసం అనుభవం
సోషల్ మీడియాలో వైరల్
నర్గీస్ ఫక్రీ ఉపవాస అనుభవాల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆమె ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Posani Krishna Murali Quits Politics for Filmmaking: Will Release One Film Annually