|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీ రికార్డులు బద్దలు కొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ! షాకింగ్ రెస్పాన్స్ తో దుమ్మురేపుతోంది!

Published: 12-02-2026, 8:35 PM
ఓటీటీ రికార్డులు బద్దలు కొట్టిన 'నారీ నారీ నడుమ మురారి' మూవీ! షాకింగ్ రెస్పాన్స్ తో దుమ్మురేపుతోంది!
  • శర్వానంద్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ ప్రైమ్‌ వీడియోలో ఇండియా వైడ్‌గా టాప్ ట్రెండింగ్!
  • సంక్రాంతికి విడుదలై థియేటర్లలో రూ.25 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.
  • కార్తీ, కృతి శెట్టి నటించిన ‘వా వాతియార్’ మూవీ కూడా ఓటీటీలో దుమ్మురేపుతోంది.
  • హాలీవుడ్ మూవీ ‘ది వ్రెకింగ్ క్యూ’ ప్రైమ్‌లో టాప్ 3లో ట్రెండ్ అవుతుండటం విశేషం.

ష‌ర్వానంద్ హీరోగా నటించిన `నారీ నారీ న‌డుమ మురారి` మూవీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. థియేటర్లలో సందడి చేయలేకపోయినా, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో దుమ్మురేపుతోంది. పూర్తి వివరాలు మీకోసం…

ప్రైమ్‌లో ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ రికార్డు

అమెజాన్‌ ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవుతున్న టాప్‌ 10 చిత్రాల్లో తెలుగు మూవీ మొదటి స్థానంలో ఉంది. అదే `నారీ నారీ నడుమ మురారి`. శర్వానంద్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్లలో సత్తా చాటింది. దాదాపు రూ.25కోట్ల వరకు వసూలు చేసింది. సరైన థియేటర్లు లేక లిమిటెడ్‌గా రిలీజ్‌ అయ్యింది. అయినా మెప్పించింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్ములేపుతుంది. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సాగుతుంది. నరేష్‌ కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది.

ప్రైమ్‌ వీడియోస్‌లో టాప్‌ 2లో ఉన్న మూవీ కార్తీ, కృతి శెట్టి నటించిన `వా వాతియార్‌`(అన్నగారు వస్తారు) ఉంది. ఈ మూవీ కూడా ఇండియా వైడ్‌గా దుమ్మురేపుతుంది. యాక్షన్‌ కామెడీగా ఈ మూవీ తెరకెక్కింది. నలన్‌ కుమారస్వామి దర్శకత్వం వహించారు. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో దీన్ని తెగ చూస్తున్నారు. ఇక మూడో స్థానంలో హాలీవుడ్‌ మూవీ `ది వ్రెకింగ్‌ క్యూ` ఉంది. ఇందులో జాసన్‌ మోమో, డేవ్‌ బాటిస్టా ప్రధాన పాత్రలు పోషించారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రం ఇండియాలో ప్రైమ్‌లో టాప్‌ 3లో ట్రెండ్‌ కావడం విశేషం.

ఓటీటీలో దుమ్మురేపుతున్న ఇతర సినిమాలు

ప్రైమ్‌లో టాప్‌ 4లో ఉన్నది శోభితా దూళిపాళ నటించిన `చీకటిలో`. ఈ యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ గత నెలలో డైరెక్ట్ గా రిలీజ్‌ అయ్యింది. ఇందులో శోభితాతోపాటు విశ్వదేవ్‌ రాచకొండ ప్రధాన పాత్ర పోషించారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రారంభంలో పెద్దగా ఆదరణ పొందలేదు. కానీ ఇప్పుడు ఇండియా వైడ్‌గా టాప్‌ 4లో ట్రెండ్‌ కావడం విశేషం. టాప్‌ 5లో తమిళ చిత్రం `మహాసేనా` ఉంది. మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి దినేషన్‌ కలైసెల్వన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో వేమల్‌, శృష్టి, యోగిబాబు నటించారు. థియేట్రికల్‌గా ఆడలేదు. కానీ ఓటీటీలో దుమ్మురేపుతుంది.

టాప్‌ 6లో సూరి నటించిన `మామన్‌` ఉంది. ఇది యాక్షన్‌ డ్రామాగా గతేడాది విడుదలయ్యింది. ప్రశాంత్‌ పాండియరాజ్‌ దర్శకత్వం వహించారు.రాజ్‌ కిరణ్‌, ఐశ్వర్య లక్ష్మీ, స్వసిక, బాల శరవనన్‌, బాబా భాస్కర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది మేలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఓటీటీలో కూడా విశేష ఆదరణ పొందుతుండటం విశేషం.

ట్రెండింగ్‌లో నిలిచిన హాలీవుడ్ మూవీ

ఏడో స్థానంలో బాలీవుడ్‌ మూవీ `120 బహదూర్‌` ఉంది. ఫర్హాన్‌ అక్తర్‌ నటించిన చిత్రమిది. హిస్టారికల్‌ వార్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి రాజ్‌నీష్‌ ఘాయ్‌ రూపొందించారు. ఫర్హాన్‌ అక్తర్‌ ఆర్మీ సైనికుడిగా నటించారు. డైరెక్ట్ ఓటీటీలోనే విడుదలై ట్రెండింగ్‌లో ఉంది. 8వ స్థానంలో `జగ్నుమాః ది ఫేబుల్‌` ఉంది. డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి రామ్‌ రెడ్డి దర్శకుడు. మనోజ్‌ బాయ్‌ పాయ్‌, దీపక్‌ డాబ్రియల్, ప్రియాంక బోస్‌ నటించారు. 9వ స్థానంలో జస్పాల్‌ సింగ్‌ సంధు ప్రధాన పాత్రలో నటించిన `వాధ్‌` ఉంది. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ మూవీ ఓటీటీలో సత్తా చాటుతోంది. ఇక 10వ స్థానంలో `ది స్ట్రేంజర్‌` అనే హర్రర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ఉంది. ఇవన్నీ ప్రైమ్‌లో ఇండియా వైడ్‌గా టాప్‌ 10వ స్థానంలో ఉండవు. వీటిలో మొత్తంగా తెలుగు సినిమా ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.

ప్రైమ్ వీడియోలో `నారీ నారీ న‌డుమ మురారి` మూవీ దూసుకుపోతుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి. మీ అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.