|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నవీన్ పొలిశెట్టి మాస్ జాతర.. బాక్సాఫీస్ బద్దలు.. రికార్డు కలెక్షన్లు!

Published: 19-01-2026, 4:00 AM
  • నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీకి సూపర్ హిట్ టాక్
  • 5 రోజుల్లో రూ.100.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రం
  • నవీన్, మీనాక్షి చౌదరి జోడికి ప్రేక్షకుల నీరాజనం
  • సంక్రాంతి సీజన్‌లో టాప్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన రాజుగారు

నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

సంక్రాంతి బరిలో రాజుగారి సంచలనం

నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)హీరోగా నటించిన తాజా కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’(Anaganaga Oka Raju) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది. నవీన్ తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)హీరోయిన్‌గా నటించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో రావు రమేష్, చమ్మక్ చంద్ర, మహేష్ ఆచంట, గోపరాజు రమణ, సత్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మిక్కి జే మేయర్ సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చింది. సంక్రాంతి బరిలో జనవరి 14న విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ ఐదు రోజుల్లోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అన్ని ఏరియాల్లోనూ సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగిస్తూ భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ ఐదు రోజుల కలెక్షన్లను అధికారికంగా ప్రకటించారు. ‘‘ఎంతో ఘనంగా.. ఇంత ధనంగా.. అనగనగా హే.. రాజు గారు సంక్రాంతిరో.. బాక్సాఫీసు బద్దలురో.. మీరే చూడండి రో.. రూ.100.2 కోట్లు’’ అంటూ స్పెషల్ పోస్ట్ ద్వారా కలెక్షన్లను వెల్లడించారు. ఈ పోస్టుతో పాటు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి కలిసి ఉన్న పోస్టర్‌ను కూడా షేర్ చేయడం విశేషం. ఈ విజయంతో ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి సీజన్‌లో టాప్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

100 కోట్ల క్లబ్‌లో నవీన్ మూవీ

వైరల్ అవుతున్న మూవీ మేకర్స్ పోస్ట్

‘అనగనగా ఒక రాజు’ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. మూవీ టీమ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.