
📌 Key Points
- నయనతార పెళ్లి, పిల్లలు తర్వాత కూడా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు.
- చిరంజీవితో కలిసి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో నటించారు.
- ప్రస్తుతం ఐదు భాషల్లో వివిధ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
- షారుక్ ఖాన్ తర్వాత సల్మాన్ ఖాన్‌తో నయనతార స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
సౌత్ సూపర్ స్టార్ నయనతార పెళ్లి, పిల్లల తర్వాత కూడా తన స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తూ, ఇప్పుడు ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.
వివాహం తర్వాత కూడా నయనతార క్రేజ్ తగ్గలేదా?
Nayanthara:సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాలు మారినా.. అదే స్టార్ స్టేటస్ ను అనుభవిస్తూ.. నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న లేడీ సౌత్ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ అదే స్టార్ హీరోయిన్ హోదాను సొంతం చేసుకొని వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా వరుస భాషలలో అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార ఇప్పటికీ ఎప్పటికీ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.
సాధారణంగా హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత దాదాపుగా అవకాశాలు తగ్గిపోతాయి. ఇక పిల్లలు పుట్టారు అంటే వారికి దర్శక నిర్మాతలు ప్రాధాన్యత కూడా ఇవ్వరు. అలాంటిది నయనతార వివాహం చేసుకోవడమే కాకుండా సరోగసి ద్వారా ఇద్దరు మగ పిల్లలకు కూడా జన్మనిచ్చింది. అయినా సరే ఈమె క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఆశ్చర్యకరమైన మరో విషయం ఏమిటంటే.. అవకాశాలు ఈమెకు రెట్టింపు స్థాయిలో లభిస్తూ ఉండడం చూస్తే ఈమె అదృష్టానికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.. ఇదిలా ఉండగా గత రెండు మూడు సంవత్సరాలుగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నయనతార.. ఈ ఏడాది చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. చిరంజీవి సరసన మరోసారి హీరోయిన్గా నటించి ఈ ఏడాది బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది నయనతార.
చిరంజీవితో కలిసి బ్లాక్ బస్టర్ హిట్
మరొకవైపు కన్నడలో కూడా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు మరో ఐదు చిత్రాలలో నటిస్తూ బిజీగా గడిపేస్తోంది నయనతార. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నయనతార ఒకేసారి ఐదు భాషలలో అందులోను అగ్ర హీరోలతో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్గా నిలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగా.. తమిళంలో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరొకటి షూటింగు జరుపుకుంటుంది. అలాగే మలయాళం లో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. కన్నడలో నయనతార నటించిన టాక్సిక్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అటు బాలీవుడ్ లో కూడా ఇప్పటికే షారుక్ ఖాన్ తో నటించిన ఈమె ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఏది ఏమైనా నయనతార ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఇదిలా ఉండగా మరొకవైపు తెలుగులో 2010లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం సింహలో నయనతార తొలిసారి బాలయ్యకు జోడిగా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పౌరాణిక చిత్రమైన శ్రీరామరాజ్యం సినిమాలో బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా నటించారు. ఇక 2018లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన జై సింహ సినిమాలో కూడా వీళ్ళిద్దరూ జంటగా నటించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఏకంగా నాలుగవసారి జంటగా నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఎన్బికె 111 సినిమాలో బాలయ్యకి జోడిగా నయనతార నటిస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు వరుస అవకాశాలనందుకుంటూ నయనతార మరింత బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఐదు భాషల్లో నయనతార హవా
మొత్తానికి నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. రాబోయే సినిమాలతో మరింత విజయం సాధించాలని ఆశిద్దాం.

