|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సల్మాన్ ఖాన్ సరసన నయనతార: ఈ కలయిక సంచలనమే!

Published: 31-03-2026, 8:05 AM
సల్మాన్ ఖాన్ సరసన నయనతార: ఈ కలయిక సంచలనమే!
  • సల్మాన్ ఖాన్‌తో వంశీ పైడిపల్లి సినిమాకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణం.
  • సల్మాన్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్‌గా ఎంపిక.
  • దిల్ రాజు బ్యానర్‌లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానుల అంచనా.
  • నయనతార తొలిసారిగా సల్మాన్ ఖాన్‌తో కలిసి నటిస్తున్నారు.

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సల్మాన్, వంశీ పైడిపల్లి కాంబోలో సినిమా

Nayanthara -Salman khan: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వంశీ పైడిపల్లి ఇటీవల కాలంలో ఇతర భాష హీరోలతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈయన చివరిగా విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాతే ఇప్పటివరకు వంశీ పైడిపల్లి మరొక కొత్త సినిమాలు ప్రకటించలేదు. అయితే గత కొద్ది రోజులుగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్(salman Khan) తో ఈయన సినిమా చేయబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది అంటూ అధికారక ప్రకటన వెలువడింది.

ఇటీవల ఈ విషయాన్ని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా వెల్లడించింది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ కి సంబంధించి కూడా చిత్ర బృందం అధికారక ప్రకటన చేశారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ జోడిగా సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్ గా నటించబోతున్నారని చిత్ర నిర్మాతలు తెలియచేశారు. ఇలా సల్మాన్ ఖాన్ సినిమాలో నయనతార ప్రధాన పాత్రలో నటించబోతున్నారన్న విషయం సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది.

ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తూ.. రాణి రాక..బహుముఖ ప్రజ్ఞకు, అత్యున్నత నైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం అయిన నయనతార సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి(Vamsi Paidipally) సినిమాలో భాగమయ్యారు. ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్టులో మీరు భాగం కావడం మాకు ఎంతో గౌరవం అంటూ నయనతార ఈ సినిమాలో నటించబోతున్నట్లు అధికారికంగా తెలియజేశారు. దిల్ రాజు బ్యానర్ లో నయనతార సల్మాన్ ఖాన్ సినిమా అంటేనే థియేటర్లలో బొమ్మ బ్లాక్ బాస్టర్ అని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఏ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తదితర విషయాల గురించి తెలియాల్సి ఉంది.

సల్మాన్ సరసన నయనతార ఫిక్స్!

The epitome of versatility and excellence #NAYANTHARA joins #SalmanKhanVamshiPaidipallyFilm 💥💥

It’s an honour to have You on board for something truly special that’s underway 🙏🏻 #SVC63 @BeingSalmanKhan @directorvamshi #DilRaju #Shirish @SVC_official … pic.twitter.com/sRtMdUBsBI

— Sri Venkateswara Creations (@SVC_official) March 31, 2026

దిల్ రాజు బ్యానర్.. బ్లాక్ బస్టర్ ఖాయమా?

ఇకపోతే నయనతార ఇది వరకు కేవలం సౌత్ ఇండియన్ సినిమాలలో మాత్రమే నటించేవారు అయితే ఈమె మొదటిసారి షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో మంచి సక్సెస్ అందుకున్న నయనతార ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె సల్మాన్ ఖాన్ సినిమాలో మరో ఛాన్స్ అందుకోవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వంశీ పైడిపల్లి దిల్ రాజు నిర్మాణంలో వారసుడు సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు తర్వాత మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

నయనతార, సల్మాన్ ఖాన్ కలయికలో వస్తున్న ఈ సినిమా ఏ జోనర్‌లో ఉంటుందో చూడాలి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.