|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘NC-24’ నుంచి బిగ్ అప్‌డేట్.. పోస్టర్‌తో హైప్ పెంచేసిన మూవీటీమ్

Published: 04-07-2025, 5:45 AM
‘NC-24’ నుంచి బిగ్ అప్‌డేట్.. పోస్టర్‌తో హైప్ పెంచేసిన మూవీటీమ్

టాలీవుడ్ నటుడు నాగ చైతన్య నటించిన NC-24 సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Key Points

1

నాగ చైతన్య నటించే NC-24 సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం.

2

చిత్ర బృందం విడుదల చేసిన స్టైలిష్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్.

4

మిథికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

NC-24 సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) రీసెంట్‌గా ‘తండేల్‌'(Thandel) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు, రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండు(Karthik Dandu) దర్శకత్వంలో NC-24 అనే మూవీలో నటించనున్నాడు. అయితే దీనిని సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

ఇక ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘ఒక అడుగు ముందుకు మరో అడుగు దగ్గరగా.. రెండో షెడ్యూల్ మొదలైంది’ అనే క్యాప్షన్ జోడించారు. ఇక పోస్టర్‌లో నాగ చైతన్య చాలా స్టైలీష్ అండ్ సీరియస్ లుక్‌లో కనిపించాడు. చేతిలో కత్తి పట్టుకుని గంబీరంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

కొత్త పోస్టర్ విడుదల

నాగ చైతన్య స్టైలిష్ లుక్

చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. నాగ చైతన్య కొత్త లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా విడుదలకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.