
తాజాగా ఒక యూట్యూబర్‌పై సినిమా నిర్మాత ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. వర్జిన్ బాయ్స్ సినిమా రివ్యూ విషయంలో నెగటివ్ రివ్యూ ఇవ్వడానికి డబ్బు డిమాండ్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
Key Points
వర్జిన్ బాయ్స్ సినిమా రివ్యూ వివాదం
యూట్యూబర్ నవీన్ పై నెగటివ్ రివ్యూ కోసం డబ్బు డిమాండ్ ఆరోపణ
పోలీసుల విచారణ జరుగుతున్నది
వర్జిన్ బాయ్స్ సినిమా రివ్యూ వివాదం
సినిమా రివ్యూల విషయంలో ఎప్పుడూ వివాదం , ఆంక్షలు కనిపిస్తూనే ఉంటాయి . అయితే , తాజాగా ఒక యూట్యూబర్ పై సినీ నిర్మాత ఫిర్యాదు చేశారు . తనను డబ్బు డిమాండ్ చేశాడని , ఇవ్వకుంటే తన సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇస్తానని చెప్పినట్లు పోలీసులకు ఆ నిర్మాత ఫిర్యాదు చేశారు . దీంతో సదురు యూట్యూబర్ ను పోలీసులు విచారించారు .
యూట్యూబర్ పై ఆరోపణలు
రీసెంట్ గా వర్జిన్ బాయ్స్ సినిమా విడుదలైంది . చాలా కష్టపడి సినిమా చేశామని అందరూ ఆదరించాలని నిర్మాత రాజా దారపునేని కోరారు . అయితే , సినిమా విడుదల తర్వాత యూట్యూబర్ నవీన్ ఇచ్చిన రివ్యూపై ఆయన మండిపడ్డారు . పూలచొక్కా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ను నవీన్ రన్ చేస్తున్నాడు . సోషల్ మీడియాలో చాలా కాలంగా సినిమా రివ్యూలు చెప్తూ ఉంటాడు .
పోలీసుల చర్య
అయితే , పూల చొక్క నవీన్ తనను రూ . 40 వేలు డబ్బు డిమాండ్ చేశాడని వర్జిన్ బాయ్స్ నిర్మాత రాజా దారపునేని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు . దీంతో అతనిపై కేసు నమోదైంది . సినిమా రివ్యూ మంచిగా ఇవ్వాలంటే డబ్బు ఇవ్వాలని లేకపోతే నెగిటివ్ రివ్యూ ఇస్తానని తనని బెదిరించినట్లు ఆ చిత్ర నిర్మాత ఫిర్యాదులో పేర్కొన్నాడు . అయితే , పూల చొక్క నవీన్ ను స్టేషన్ కు పిలిపించి విచారించిన పోలీసులు తిరిగి పంపించేశారు .
ఈ ఘటన సినిమా రివ్యూల ప్రభావం మరియు సోషల్ మీడియా బాధ్యతలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. పూలచొక్క నవీన్ పై విచారణ కొనసాగుతోంది.


