|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అత్తా కోడళ్ల సీరియల్‌తో స్టార్ట్ చేయాల్సింది.. నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఓ తెలివి తక్కువ వాడు: బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్

Published: 08-06-2025, 2:40 AM
అత్తా కోడళ్ల సీరియల్‌తో స్టార్ట్ చేయాల్సింది.. నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఓ తెలివి తక్కువ వాడు: బాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్

నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ఇటీవల ‘సేక్రెడ్ గేమ్స్’ గురించి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నుండి తీవ్ర విమర్శలకు దారితీశాయి. కశ్యప్ సరండోస్ వ్యాఖ్యలను ‘తెలివి తక్కువ’ అని పేర్కొన్నారు.

Key Points

1

నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ 'సేక్రెడ్ గేమ్స్'పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

2

అనురాగ్ కశ్యప్ సరండోస్ వ్యాఖ్యలను 'తెలివి తక్కువ' అని అభివర్ణించారు.

4

'సేక్రెడ్ గేమ్స్' నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోని మొదటి ఒరిజినల్ సిరీస్.

నెట్‌ఫ్లిక్స్ సీఈవో వ్యాఖ్యలు

నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరండోస్ ఇటీవల నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోని ‘సేక్రెడ్ గేమ్స్’, ‘హీరామండి’ నుండి ‘సీఐడీ’, ‘కపిల్ శర్మ షో’ వరకు పలు విషయాలపై మాట్లాడారు. అయితే, ‘సేక్రెడ్ గేమ్స్’ గురించి ఆయన చేసిన ఒక వ్యాఖ్య, ఆ షో క్రియేటర్ అనురాగ్ కశ్యప్‌కు నచ్చలేదు. సరండోస్ వ్యాఖ్యలను “తెలివి తక్కువ” అని పేర్కొంటూ కశ్యప్ సోషల్ మీడియాలో విరుచుకుపడ్డాడు.

నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ప్రోగ్రామింగ్‌ను ‘సేక్రెడ్ గేమ్స్’తో ప్రారంభించాలనే ఆలోచన సరైనదేనా అని తాను కచ్చితంగా చెప్పలేనని సరండోస్ అన్నారు. దానికి బదులుగా మరింత ‘పాపులిస్ట్’ (ప్రజాదరణ పొందిన) కంటెంట్‌తో ప్రారంభించి ఉండాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.

అనురాగ్ కశ్యప్ ప్రతిస్పందన

సరండోస్ వ్యాఖ్యలపై వచ్చిన ఒక న్యూస్ క్లిప్ ను పంచుకుంటూ.. అనురాగ్ కశ్యప్ థ్రెడ్స్‌లో ఇలా పోస్ట్ చేశాడు. “అతను అత్తా కోడళ్ల సీరియల్ తో ప్రారంభించి ఉండాల్సింది. అది బాగా చేసేవాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. స్టోరీ టెల్లింగ్ విషయంలో టెక్ నిపుణులు తెలివి తక్కువ వారని నాకు ఎప్పుడూ తెలుసు. కానీ టెడ్‌ సరండోస్ తెలివి తక్కువతనానికి నిర్వచనం అని నాకు తెలియదు. అది తెలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్నీ అర్థమయ్యాయి” అని అనురాగ్ పోస్ట్ చేయడం గమనార్హం.

‘సేక్రెడ్ గేమ్స్’ నెట్‌ఫ్లిక్స్ మొదటి ఇండియన్ ఒరిజినల్ సిరీస్. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన ఈ షోలో సైఫ్ అలీ ఖాన్ , నవాజుద్దీన్ సిద్దిఖీ నటించారు. 2018లో విడుదలైనప్పుడు దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, రెండో సీజన్‌కు మిక్స్‌డ్ రివ్యూలు రావడంతో షోని అక్కడితో ఆపేశారు.

‘సేక్రెడ్ గేమ్స్’ విజయం మరియు వివాదం

పాడ్‌కాస్ట్‌లో సరండోస్ మాట్లాడుతూ.. ఇండియన్ మార్కెట్‌లో సరైన పద్ధతిని తెలుసుకోవడానికి నెట్‌ఫ్లిక్స్‌కు కొన్ని సంవత్సరాలు పట్టిందని అంగీకరించారు. “మా మొదటి భారతీయ ఒరిజినల్ షో ‘సేక్రెడ్ గేమ్స్’. ఇది చాలా గొప్పగా ఉంటుందని అనుకున్నాను. భారతదేశంలో ప్రజలు సినిమాలను ఇష్టపడతారు. ఇది ఒక సినిమా అంత పెద్దగా అనిపించే టీవీ షో. ఇందులో సినిమా స్టార్లు ఉన్నారు. దీని గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇది చాలా కొత్తగా ఉంది. కానీ ఇండియాలాంటి పెద్ద దేశంలో మేము సరికొత్త వినోదాన్ని పరిచయం చేస్తున్నామని నేను అర్థం చేసుకోలేదు” అని ఆయన అన్నారు.

“ఒకవేళ నేను మళ్లీ అలా చేసే అవకాశం వస్తే.. ‘సేక్రెడ్ గేమ్స్’ను రెండు సంవత్సరాల తర్వాత రిలీజ్ చేసి.. మరింత ప్రజాదరణ పొందిన కంటెంట్‌ను (దానికి బదులుగా) చేసి ఉండేవాడినా? చేసి ఉండొచ్చు. ఇండియాలో రాబోయే కొన్ని సంవత్సరాల్లో మార్కెట్ పెరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.

నెట్‌ఫ్లిక్స్ ఇండియా వ్యూహంపై ఈ వివాదం తీవ్ర చర్చను రేకెత్తిస్తోంది. భారతీయ ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకోవడంలో నెట్‌ఫ్లిక్స్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ ఘటన హైలైట్ చేస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.