|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: పెళ్ళికి ముందే పిల్లలు కావాలన్న రాజాసాబ్ హీరోయిన్! వైరల్ కామెంట్స్!

Published: 22-01-2026, 6:35 AM
  • ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాతో నిధి అగర్వాల్ ప్రేక్షకులకు ట్రీట్!
  • పెళ్లి కాకుండానే నలుగురు పిల్లలు కావాలన్న నిధి సంచలన ప్రకటన.
  • చిన్నప్పటి నుండి పిల్లలంటే ఇష్టమని తెలిపిన రాజాసాబ్ భామ.
  • దత్తత తీసుకోవాలనుకున్నా పరిస్థితులు సహకరించలేదన్న నిధి అగర్వాల్.

ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నిధి అగర్వాల్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇంతకీ నిధి ఏం మాట్లాడారో తెలుసుకోవాలని ఉందా? అయితే చదవండి.

పెళ్లి గురించి నిధి ఏమన్నారంటే?

Nidhhi Agerwal : ఇటీవలే ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిధి అగర్వాల్. చేసింది తక్కువ సినిమాలైనా బాగానే ఫేమ్ తెచ్చుకుంది నిధి. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ ఫోజులతో వైరల్ అవుతూనే ఉంటుంది. రాజాసాబ్ రిలీజ్ తర్వాత వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది నిధి అగర్వాల్.(Nidhhi Agerwal)

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పిల్లల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిధి అగర్వాల్.

పిల్లలంటే ఎందుకంత ఇష్టమో చెప్పిన నిధి

నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. నా పెళ్ళికి చాలా టైం ఉంది. కానీ పిల్లలు మాత్రం కావాలి. నాకు కనీసం నలుగురు పిల్లలు కావాలి. నేను పిల్లల గురించి రెగ్యులర్ గా ఆలోచిస్తాను. పెళ్లి కంటే ముందే పిల్లల్ని దత్తత తీసుకోవాలని కూడా అనుకున్నాను. కానీ పిల్లల్ని పెంచాలంటే మనం మరో ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యపడదు.

దత్తత గురించి నిధి సంచలన నిర్ణయం!

నాకు చిన్నప్పట్నుంచి పిల్లలు అంటే ఇష్టం. మా పేరెంట్స్ నేను పుట్టాక ఒక పాప చాలు అనుకున్నారు. కానీ నాకు చెల్లి కావాలని దేవుడి దగ్గర ఉత్తరం రాసి పెట్టేదాన్ని. నేను పుట్టిన ఏడేళ్ల తర్వాత నాకు చెల్లి పుట్టింది. తనను చెల్లిలా కాకుండా కూతురిలా చూసుకుంటాను అని తెలిపింది.

నిధి అగర్వాల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె భవిష్యత్తు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.