|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

64 ఏళ్ళ నటుడితో నిధి అగర్వాల్ రొమాన్స్ ?

Published: 05-07-2025, 7:23 AM
64 ఏళ్ళ నటుడితో నిధి అగర్వాల్ రొమాన్స్ ?

సినిమా ఇండస్ట్రీలో వార్తలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు వెంకటేష్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Key Points

1

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ నటించే కొత్త సినిమా.

2

సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం.

4

సినిమా 2026 సమ్మర్ లో విడుదల కానుంది.

వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా

విక్టరీ వెంకటేష్ ( Venkatesh) గురించి చెప్పాల్సిన పనిలేదు. 64 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఆయన యంగ్ హీరో గానే కనిపిస్తారు. కుర్ర హీరోలకు ఎప్పుడు ఆయన పోటీగానే నిలుస్తారు. అలాంటి విక్టరీ వెంకటేష్ ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. ప్రతి సినిమాలో కామెడీతో అదరగొట్టే విక్టరీ వెంకటేష్.. ఈ సినిమాలో కూడా ఇద్దరు భామలతో రొమాన్స్ చేసి రచ్చ చేశారు.

రెండవ హీరోయిన్ గా నిధి అగర్వాల్?

సంక్రాంతికి వస్తున్నాం ( Sankranthiki Vasthunnam) సినిమా బంపర్ హిట్ కావడంతో తర్వాత చేసే ప్రాజెక్టుపై కాస్త దృష్టి పెట్టారు. చాలా జాగ్రత్తలు పడుతున్నారు విక్టరీ వెంకటేష్. ఈ నేపథ్యంలోనే మాటల త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు విక్టరీ వెంకటేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందట. 2026 సమ్మర్ సమయంలో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. మల్లీశ్వరి అలాగే నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నారు.

2026 సమ్మర్ లో సినిమా విడుదల

ఇక ఇప్పుడు డైరెక్టర్ గా త్రివిక్రమ్ ( Trivikram) నేరుగా వెంకటేష్ తో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు.. వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లను తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. నయనతార లాంటి ఫేమ్ ఉన్న హీరోయిన్ ను అలాగే మరొక యంగ్ హీరోయిన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలోనే ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ( nidhhi agerwal) పేరు తెరపైకి వచ్చింది. ఈమెను రెండవ హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

వెంకటేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమాకు నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేరే అవకాశం ఉంది. 2026లో ఈ సినిమా విడుదల కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.