|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: సంతోషంలో మెగా ఫ్యామిలీ.. నిహారిక మనసులో ఇంత బాధ ఉందా?

Published: 01-02-2026, 12:05 PM
షాకింగ్: సంతోషంలో మెగా ఫ్యామిలీ.. నిహారిక మనసులో ఇంత బాధ ఉందా?
  • నిహారిక తన మానసిక వేదనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
  • వ్యాయామం మరియు యోగా ద్వారా ఒత్తిడిని జయించాలని నిహారిక సూచించారు.
  • విడాకుల తర్వాత నిహారిక కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
  • మెగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొన్న సమయంలో నిహారిక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆమె తన మనసులో ఏదో తెలియని భారం మోస్తున్నానని, దానిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

నిహారిక ఎమోషనల్ పోస్ట్ వెనుక కారణం?

Niharika: మెగా డాటర్ నిహారిక పరిచయం అవసరం లేని పేరు. నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిహారిక (Niharika )ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. నాగబాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఈమె ఆరోగ్య విషయంలో ఫిట్నెస్ విషయంలో కూడా అంతే శ్రద్ధ చూపిస్తూ ఉంటారు సమయం దొరికితే చాలు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఇలా వృత్తిపరమైన పరమైన జీవితంలో బిజీగా గడుపుతున్న నిహారిక తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ప్రస్తుతం మెగా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంలో ఉండగా నిహారిక ఈ ఎమోషనల్ పోస్ట్ మాత్రం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. మరి నిహారిక చేసిన ఆ పోస్ట్ ఏంటి అనే విషయానికి వస్తే.. వేదికగా ఈమె తన మనసులో ఉన్న మానసిక క్షోభ గురించి బయటపెట్టారు. ఈ సందర్భంగా నిహారిక ఒక వీడియోని షేర్ చేస్తూ నాలోపల ఏదో తెలియని బరువును మోస్తున్నాను.. అది ఒత్తిడి కావచ్చు లేదా మరేదైనా కావచ్చు.. ఆ భారాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు అంటూ ఈమె ఒక పోస్ట్ చేశారు. నేను మోస్తున్న ఈ భారానికి కృంగిపోకుండా తాను ముందుకు సాగడానికే ఆసక్తి చూపుతున్నానని ఈ భారం నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని రోజులు జిమ్ కి వెళ్లి వర్కర్స్ చేస్తున్నాను మరి కొన్ని రోజులు వాకింగ్ లేదా యోగా వంటి వాటిని చేస్తున్నానని తెలిపారు.

మానసిక ఒత్తిడిని జయించడానికి నిహారిక ప్రయత్నాలు

ఇలా మానసిక ఒత్తిడిని వ్యాయామం వర్కౌట్ ద్వారా ఎలా జయించవచ్చు అనే విషయాలను నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ పోస్ట్ పై పలువురు విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు నీహా మీరు చాలా స్ట్రాంగ్ అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు నిహారిక వ్యాఖ్యలపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు నిహారిక కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం సంతోషంగా లేరనే సంగతి అందరికీ తెలిసిందే.

నిహారిక ఇదివరకే వివాహం చేసుకొని తన భర్తకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా వైవాహిక జీవితం నుంచి బయటకు వచ్చిన ఈమె నిర్మాతగా కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇలా ఈ విషయాల కారణంగానే నిహారిక ఒత్తిడి ఫీల్ అవుతున్నారా? అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మెగా కుటుంబ సభ్యులందరూ వారసుడొచ్చాడు అంటూ సంతోషపడుతున్న సమయంలో నిహారిక మాత్రం ఇలాంటి పోస్ట్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇక నిహారిక కెరియర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈమె తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై సంగీత్ శోభన్ తో కలిసి రాకాసా అనే సినిమాకు నిర్మాతక వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కెరీర్ పై నిహారిక ఫోకస్

మొత్తానికి నిహారిక తన జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. ఆమె త్వరగా ఈ బాధ నుండి బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.