
📌 Key Points
- అకీరా నందన్ ఎంట్రీపై వస్తున్న రూమర్స్‌పై నిహారిక స్పష్టతనిచ్చారు.
- అకీరా నందన్ హీరో అవుతాడా లేదా అనే విషయం తనకు తెలియదని నిహారిక అన్నారు.
- సెలబ్రిటీ పిల్లల ప్రైవసీకి భంగం కలిగించడం సరికాదని నిహారిక హెచ్చరించారు.
- విడాకుల గురించి నాన్న నాగబాబుతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకున్నానని నిహారిక తెలిపారు.
నిహారిక కొణిదెల తన తమ్ముడు అకీరా నందన్ సినిమా ఎంట్రీ గురించి వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. అంతేకాకుండా సెలబ్రిటీల పిల్లల ప్రైవసీ గురించి కూడా ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. తన విడాకుల గురించి కూడా ఆమె మాట్లాడారు.
అకీరా ఎంట్రీపై నిహారిక క్లారిటీ
Niharika Konidela:డాటర్ నిహారిక (Niharika) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలోకి హీరోయిన్గా సక్సెస్ అందుకోవాలనుకున్న ఈమెకు కాలం కలిసి రాలేదు. దీంతో ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూనే.. మరొకవైపు నిర్మాతగా అడుగులు వేసి ఇప్పుడు సక్సెస్ అయ్యింది. అందులో భాగంగానే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చేసి అవార్డులు కూడా అందుకున్న ఈమె.. ఇప్పుడు రాకాస అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటుంది నిహారిక. ఈ క్రమంలోనే తన తమ్ముడు, తన బాబాయ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారసుడైన అకీరా నందన్ (Akira Nandan) ఇండస్ట్రీ ఎంట్రీపై ఊహించని కామెంట్లు చేసి మెగా అభిమానులను సర్ప్రైజ్ చేసింది నిహారిక.
అకీరా గురించి నిహారిక మాట్లాడుతూ..” మై స్మాల్ బిగ్ బేబీ” అంటూ అభివర్ణించింది. అకీరా హార్ట్ ఆఫ్ గోల్డ్.. బాబాయ్ పవన్ కళ్యాణ్ లాగే ఎక్కువ మాట్లాడడు. కానీ ప్రేమ మాత్రం చాలా ఎక్కువ చూపిస్తాడు. హీరో అవుతాడా లేదా అనే విషయం నాతో డైరెక్ట్ గా చెప్పలేదు. మీడియా ఎక్స్ప్లోజర్ వల్లే ఈ విషయంపై ఎక్కువ ప్రచారం జరుగుతోంది అంటూ నిహారిక కామెంట్లు చేసింది. ఇకపోతే నిహారిక చేసిన ఈ కామెంట్లకు అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అంటే అకీరా నందన్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టరా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సెలబ్రిటీ పిల్లల ప్రైవసీపై నిహారిక హెచ్చరిక
ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్ల వద్ద అకీరాను ఒమేగా స్టార్ అని పేర్కొంటూ ప్లకార్డులు కూడా కనిపించడం పై నిహారిక స్పందించారు. సెలబ్రిటీ పిల్లల ప్రైవసీకి భంగం కలిగించే విధంగా వ్యవహరించడం సరైనది కాదు.. మా టైంలో సోషల్ మీడియా అంతగా లేదు కాబట్టే మా బాల్యం మొత్తం బాల్యంగానే గడిచింది. కానీ ఇప్పుడు పిల్లల ప్రైవసీని కూడా గౌరవించాలి . అది అభిమానంగా కాదు అబ్యూస్ గా మారుతోంది అంటూ గట్టిగా హెచ్చరించింది నిహారిక.
ఇకపోతే నిహారిక తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఓపెన్ గానే మాట్లాడింది. రిలేషన్షిప్ నుంచి బయటకి రావాలని అనుకున్నప్పుడు మా నాన్న నాగబాబుతో మాట్లాడాను. నేను సంతోషంగా లేనని ఆయన అర్థం చేసుకున్నారు. జీవితంలో సంతోషంగా లేకపోతే బలవంతంగా ఆ బంధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. దాంతో విడాకులు తీసుకున్నాను అంటూ నిహారిక తెలిపింది.
విడాకుల గురించి నిహారిక ఓపెన్ కామెంట్స్
నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవు. కానీ పెళ్లి మాత్రం చేసుకుంటాను. సరైన వ్యక్తి నా జీవితంలోకి రావాల్సి ఉంటే తప్పకుండా వస్తారు.. అప్పుడే నేను కూడా రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది నిహారిక మొత్తానికైతే రాకాస మూవీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అటు వ్యక్తిగత ఇటు వృత్తిపరమైన విషయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది నిహారిక.
నిహారిక తన వ్యక్తిగత మరియు వృత్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా అకీరా నందన్ ఎంట్రీ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.


