|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రోలర్స్‌పై నిహారిక సంచలన వ్యాఖ్యలు! కుక్కలతో పోల్చి షాకింగ్ కామెంట్స్!

Published: 22-03-2026, 8:35 AM
ట్రోలర్స్‌పై నిహారిక సంచలన వ్యాఖ్యలు! కుక్కలతో పోల్చి షాకింగ్ కామెంట్స్!
  • నిహారిక తన కుటుంబంపై ట్రోల్స్ చేసేవారిని కుక్కలతో పోల్చింది.
  • సోషల్ మీడియా కామెంట్లను చూడనని, వాటి గురించి పట్టించుకోనని నిహారిక తెలిపింది.
  • లావణ్య త్రిపాఠిపై అసభ్యకర కామెంట్లపై నిహారిక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
  • ట్రోల్స్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిహారిక అభిప్రాయపడింది.

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల, సోషల్ మీడియాలో తన కుటుంబంపై వచ్చే ట్రోల్స్‌పై స్పందించారు. ట్రోల్స్ చేసేవారిని కుక్కలతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ట్రోల్స్ పై నిహారిక సీరియస్ కామెంట్స్

Niharika Konidela: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక (Niharika)ప్రస్తుతం సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలకు నిర్మాతగా కొనసాగుతున్న ఈమె త్వరలోనే  రాకాసా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిహారికకు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ గురించి వచ్చే ట్రోల్స్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల తను వదిన లావణ్య త్రిపాఠి పట్ల కూడా సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకరమైన కామెంట్లు చేయడంతో ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఇలా సోషల్ మీడియా ట్రోల్స్ గురించి నిహారికకు ప్రశ్నలు ఎదురవడంతో ఈమె సమాధానం చెబుతూ సంచలన విషయాలను బయటపెట్టారు. కొంతమంది ట్రోల్స్ చేయడం తమ జన్మ హక్కుగా భావిస్తూ ఉంటారు. ఎన్నిసార్లు కామెంట్లు చేసిన మనం అలా దులుపుకుంటూ పోలేము ఏదో ఒకసారి మనం ఆ కామెంట్లకు ఎఫెక్ట్ అవుతామని అలాంటి టైంలోనే మనం కచ్చితంగా కంప్లైంట్ ఇస్తే ఒకడి పట్ల చర్యలు తీసుకుంటే మిగిలిన వారందరూ కూడా అలర్ట్ అవుతారని నిహారిక తెలిపారు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరని భావనలో ఉంటారు అలాంటివారికి ఒకసారి మనం కచ్చితంగా శిక్ష వేస్తే తదుపరి అలాంటి తప్పు చేయరని తెలిపారు.

కుక్కలతో పోల్చిన నిహారిక

ఇలా ఒక వ్యక్తి రూపురేఖల గురించి అలాగే వారి వ్యక్తిగత విషయాల గురించి కామెంట్లు చేసే వాళ్ళని మనుషులుగా కూడా భావించకూడదు. ఇక మీ వ్యక్తిగత విషయాల గురించి చాలామంది కామెంట్ లో చేస్తుంటారు వాటిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్నలు ఎదురవుగా నిహారిక సమాధానం చెబుతూ కారుని చూసి కుక్కలు మొరుగుతుంటాయి. అలా మొరిగే వారిని మనం పట్టించుకోకూడదు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారిని ఏకంగా కుక్కలతో పోల్చేసి నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో తాను సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను ఏమాత్రం చూడటం లేదని తెలిపారు.

సోషల్ మీడియా కామెంట్లు చూడను..

సోషల్ మీడియా కామెంట్స్ చూడను: నిహారిక

నేను ఏదైనా ఒక పోస్ట్ చేస్తే నాకు సంబంధించిన వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు కచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ఆన్ చేసి మాత్రమే తాను మెసేజ్ చదువుతాను మిగిలిన కామెంట్ లు అసలు చూడనని నిహారిక తెలిపారు. వాళ్లు నన్ను బూతులు తిట్టినా, లేదంటే నేనొక అప్సరసలాగా ఉన్నానని చెప్పినా నాకు తెలియదు నేను కామెంట్ లు చూడను అంటూ నిహారిక ఈ సందర్భంగా సోషల్ మీడియా ట్రోల్స్ గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇండస్ట్రీలో కొనసాగే ప్రతి ఒక్క సెలబ్రిటీకి కూడా సోషల్ మీడియా నుంచి ఈ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది వాటిని చూసి చూడనట్లు వదిలేయగా, మరి కొంతమంది చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు.

నిహారిక చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రోల్స్ చేసేవారి పట్ల ఆమెకున్న ఆగ్రహాన్ని ఈ కామెంట్స్ తెలియజేస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.