|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Niharika Konidela: ఇక్కడికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది.. మెగా డాటర్ నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published: 10-05-2025, 3:08 PM

‘కథకళి’ అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ సినిమా ముహూర్తానికి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ ఇచ్చారు. ఆమె సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Key Points

1

నిహారిక కొణిదెల 'కథకళి' సినిమా ముహూర్తానికి క్లాప్ ఇచ్చారు.

2

‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

4

మెగా డాటర్ నిహారిక సినిమాపై ఆసక్తికరమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

‘కథకళి’ సినిమా లాంచ్

‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ యశ్వంత్ పెండ్యాల, బ్రహ్మాజీ, మధు దామరాజు, మైమ్ మధు ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్న మూవీ ‘కథకళి’ (Kathakali). ప్రసన్న కుమార్ నాని దర్శకత్వంలో రూపొందనున్న ఇంటెన్స్ న్యూఏజ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని మాన్యత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవికిరణ్ కలిదిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈరోజు గ్రాండ్‌గా పూజాకార్యక్రమాలతో లాంచ్ అయ్యింది. నిహారిక కొణిదెల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. హర్షిత్ రెడ్డి కెమరా స్విచాన్ చేశారు. బ్రహ్మాజీ స్క్రిప్ట్ అందించగా ఫస్ట్ షాట్‌కి డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని దర్శకత్వం వహించారు. లాంచింగ్ అనంతరం నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘కథాకళి టీంకి బిగ్ కంగ్రాట్యులేషన్స్. యశ్వంత్ మా కమిటీ కుర్రాళ్లు సినిమాల్లో నటించాడు. తన కొత్త సినిమా ముహూర్తానికి నేను రావడం చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మాజీ యశ్వంత్‌కి చాలా మంచి సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. ఈ సినిమా హ్యుజ్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. డైరెక్టర్ ప్రసన్న కుమార్ నాని మాట్లాడుతూ.. ‘మంచి ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో వస్తున్నాం. నెక్స్ట్ మంత్ షూట్ స్టార్ట్ కాబోతోంది. ఈవెంట్‌కి వచ్చిన అందరికీ థాంక్యు’ అన్నారు.

నిహారిక కొణిదెల కామెంట్స్

సినిమా వివరాలు

నిహారిక కొణిదెల ఆశీస్సులతో, ‘కథకళి’ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశిద్దాం. ఈ క్రైమ్ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.