|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిర్మాత నుండి దర్శకురాలిగా నిహారిక కొణిదెల సంచలనం! మెగా ఫ్యామిలీలో సరికొత్త చరిత్ర!

Published: 22-03-2026, 5:05 AM
నిర్మాత నుండి దర్శకురాలిగా నిహారిక కొణిదెల సంచలనం! మెగా ఫ్యామిలీలో సరికొత్త చరిత్ర!
  • మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి నిహారిక.
  • హీరోయిన్‌గా నిహారిక సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
  • నిర్మాతగా నిహారిక పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తున్నారు.
  • త్వరలో డైరెక్టర్‌గా మారే అవకాశం ఉందని నిహారిక వెల్లడి.

నిహారిక కొణిదెల మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్. ఆమె మొదట యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, తరువాత హీరోయిన్‌గా సినిమాలు చేశారు. ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తూ, త్వరలోనే డైరెక్టర్ అవ్వాలని చూస్తున్నారు.

హీరోయిన్‌గా నిహారిక ప్రయాణం

Niharika Konidela: నిహారిక మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక హీరోయిన్ అని చెప్పాలి. అప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. కానీ మొదటిసారి ఒక అమ్మాయి మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా వెండి తెరపై సందడి చేసిన ఘనత నిహారికకు దక్కిందని చెప్పాలి. ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా బుల్లితెర కార్యక్రమాలకు పని చేశారు. అనంతరం ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే నిహారికను హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయటానికి మెగా అభిమానులు కూడా ఇష్టపడలేదనే చెప్పాలి దీంతో ఈమె సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఇలా మూడు సినిమాలలో నటించిన నిహారిక మూడు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కానీ నేపథ్యంలో ఈమె సినిమాలకు హీరోయిన్ గా దూరమవుతు నిర్మాతగా స్థిరపడ్డారు. ఇదివరకు పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహరించిన నిహారిక ఇప్పుడు సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే రాకాసా(Raakaasaa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈమె ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

నిర్మాతగా నిహారిక విజయాలు

ఇలా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిహారికకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత యాంకర్ గా పనిచేశారు నటిగా, నిర్మాతగా కూడా పనిచేశారు ఫ్యూచర్లో ఏమైనా డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు నిహారిక సమాధానం చెబుతూ.. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. సినిమా కోసం తాను ఏం నేర్చుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని 24 క్రాఫ్ట్స్ మీద తనకు అవగాహన ఉండాలని కోరుకుంటానని తెలిపారు. తనకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కచ్చితంగా అవగాహన ఉండి వాటి గురించి అన్ని విషయాలు నేర్చుకుంటే ఏదో ఒక రోజు డైరెక్టర్ గా కూడా మారుతానని ఈ సందర్భంగా నిహారిక తెలిపారు.

మొదటి డైరెక్టర్ గా నిహారిక గుర్తింపు..

డైరెక్టర్‌గా మారనున్న నిహారిక

యాంకర్ గా నటిగా నిర్మాతగా సక్సెస్ అందుకున్న ఈమె దర్శకురాలిగా కూడా మారుతానని, భవిష్యత్తులో మెగా ఫోన్ పట్టుకుంటానని చెప్పడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఒకవేళ నిహారిక దర్శకురాలు అయితే మెగా కాంపౌండ్ లోనే డైరెక్ట్ గా మారిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈమె డైరెక్టర్ గా మారే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే నిహారిక నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

మొత్తానికి నిహారిక నటిగా, నిర్మాతగా రాణించి, ఇప్పుడు డైరెక్టర్‌గా కూడా మారాలని చూస్తుండటం ఆమె అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆమె భవిష్యత్తులో ఎలాంటి విజయాలు సాధిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.