
📌 Key Points
- నిర్మాతగా నిహారిక మరో చిత్రం: రాకాస ఏప్రిల్ 3న విడుదల.
- సెన్సార్ పూర్తి: ‘రాకాస’కు U/A సర్టిఫికెట్, 133 నిమిషాల నిడివి.
- ఫాంటసీ హర్రర్ కామెడీగా ‘రాకాస’, సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటన.
- వరుణ్ తేజ్‌తో నిహారిక కొత్త సినిమా ‘బరి’ ప్రకటన.
నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘రాకాస’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటించారు.
సెన్సార్ పూర్తి చేసుకున్న రాకాస
Raakaasa: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పై ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి నిర్మాతగా సక్సెస్ అయ్యారు. ఇక నిహారిక ప్రస్తుతం సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కమిటీ కుర్రోళ్ళు సినిమాతో సక్సెస్ అందుకున్న నిహారిక త్వరలోనే రాకాస(Raakaasa) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ మూడో తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా గట్టిగా నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిహారిక (Niharika) సైతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాపై భారీ అంచనాలను పెంచేశారు. ఇక ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో విడుదలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంది ఇక తాజాగా సెన్సార్ బోర్డ్ ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసిన సంగతి తెలిసిందే .అలాగే ఈ సినిమా నిడివి కూడా సెన్సార్ బోర్డు ప్రకటించింది. ఏ విధమైనటువంటి కట్స్ లేకుండా ఈ సినిమా 133:00 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..
ఏప్రిల్ 3న రాకాస విడుదల
ఇక ఈ సినిమా ఏప్రిల్ మూడవ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏప్రిల్ 2 నుంచి ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఫాంటసీ హర్రర్ కామెడీ నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహించగా, సంగీత్ శోభన్(Sangeeth Sobhan), నయన్ సారిక(Nayan Sarika) హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక సినిమాలో గెటప్ శ్రీను కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసాయి. మరి ఏప్రిల్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాకాస నిహారికకు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.
అన్నయ్యతో కొత్త సినిమా ప్రకటించిన నిహారిక..
వరుణ్ తేజ్‌తో నిహారిక కొత్త సినిమా
ఇక నిహారిక ఈ సినిమా విడుదల కాకుండానే మరో కొత్త సినిమాని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే తన మూడవ సినిమాని వరుణ్ తేజ్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే .గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బరి(Bhari) అనే టైటిల్ తో వాలీబాల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని ఇటీవల చిత్ర బృందం వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సినిమాకు కమిటీ కుర్రోళ్ళు డైరెక్టర్ యదు వంశీ దర్శకుడిగా వ్యవహరించబోతుండటం విశేషం.
మొత్తానికి నిహారిక నిర్మించిన రాకాస చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నిహారికకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. అంతేకాకుండా వరుణ్ తేజ్‌తో ఆమె చేయబోయే సినిమా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.


