|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

డార్క్ ఇంటెన్స్ థ్రిల్లర్ ‘నిఖితా రాయ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్

Published: 30-05-2025, 5:51 AM

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నటించిన ‘నిఖితా రాయ్’ చిత్రం విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. జూన్ 27న విడుదల అవుతున్న ఈ చిత్రం డార్క్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది.

Key Points

1

సోనాక్షి సిన్హా నటించిన ‘నిఖితా రాయ్’ చిత్రం జూన్ 27న విడుదల.

2

డార్క్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.

4

రిలీజ్ పోస్టర్‌లో సోనాక్షి కోపంగా కనిపించడం ఆసక్తిని రేపుతోంది.

నిఖితా రాయ్ విడుదల తేదీ ఖరారు

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి(Sonakshi Sinha) ‘దబాంగ్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక హిందీలో సలు సినిమాల్లో నటించిన ఆమె తన పాపులారిటీని పెంచుకుంది. ఇక వరుస చిత్రాలతో కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఈనేపథ్యంలో.. అంతా సోనాక్షి ఇండస్ట్రీకి దూరం అవుతుందని భావించారు. కానీ ఆమె మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం, సుధీర్ బాబు(Sudheer Babu) నటిస్తున్న ‘జటాధర’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది. తాజాగా, సొనాక్షి సిన్హా మరో మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు చిత్రబృందం.

అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసి హైప్ పెంచేశారు. సోనాక్షి సిన్హా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నిఖితా రాయ్’. అయితే ఇందులో పరేష్ రావల్(Paresh Rawal), అర్జున్ రాంపాల్(Arjun Rampal), సోహెల్ నాయర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి ఖుష్ సిన్హా దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని నిక్కీవిక్కీ భగ్నానీ ఫిల్మ్స్, క్రాటోస్, నిఖితపాయ్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మి్స్తున్నారు. అయితే డార్క్ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ పోస్టర్‌లో సోనాక్షిని హైలెట్ చేయగా.. ఆమె కోపంగా కనిపించింది. అయితే ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రాబోతున్నట్లు టాక్. ప్రస్తుతం ప్రేక్షకుల్లో సొనాక్షి మూవీ పోస్టర్ అంచనాలను పెంచేస్తోంది.

సోనాక్షి సిన్హా కీలక పాత్ర

డార్క్ యాక్షన్ థ్రిల్లర్ విశేషాలు

చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులలో అంచనాలను పెంచింది. ‘నిఖితా రాయ్’ చిత్రం ఖచ్చితంగా సోనాక్షి సిన్హా కెరీర్‌కు మరో మైలురాయి అవుతుందని అనిపిస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.