
నిన్ను కోరి సీరియల్ ఆగస్టు 4వ తేదీ ఎపిసోడ్‌లో, విరాట్ మరియు చంద్రకళ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, శ్రుతితో చంద్రకళ గొడవ, జగదీశ్వరికి శాలిని మరియు క్రాంతిపై అనుమానాలు వంటి ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి.
Key Points
విరాట్ చంద్రకళకు దుప్పటి కప్పుతాడు, వారి మధ్య రొమాన్స్.
శ్రుతి మాటలకు చంద్ర చెంప చెళ్లుమనిపిస్తుంది.
జగదీశ్వరికి శాలిని, క్రాంతిపై అనుమానం.
చంద్రకళకు విరాట్ పై ప్రేమ ఉందని తెలుస్తుంది.
విరాట్ మరియు చంద్రకళ మధ్య ప్రేమ
నిన్ను కోరి సీరియల్ టుడే ఆగస్టు 4వ తేదీ ఎపిసోడ్ లో స్టోర్ రూమ్ లో పడుకున్న చంద్రకళకు దుప్పటి కప్పుతాడు విరాట్. అప్పుడు విరాట్ చేతిని మెడ కింద పెట్టుకుంటుంది చంద్ర. అప్పుడు ఓ రొమాంటిక్ ఫీల్ వస్తుంది. చంద్రకళను చూస్తూ ఉండిపోతాడు విరాట్. ప్రేమగా తల నిమురుతాడు. ఎంత ముద్దుగా పడుకున్నావే, గుడ్ నైట్ బంగారం అని చెప్పి వెళ్లిపోతాడు.
ఉదయం చంద్రకళ పూజ చేస్తుంది. జగదీశ్వరీ మసాజ్ ఆయిల్ తీసుకుని వస్తుంది. నేను ఆల్రెడీ మసాజ్ చేశాను అత్తయ్య అని చెప్తుంది చంద్రకళ . మామయ్య త్వరలోనే కోలుకోవాలని కోరుకుంటుంది చంద్ర. దేవుడి దగ్గర ఎలాంటి భేధాలు ఉండవు, హారతి తీసుకోమని శ్యామల కు చెప్తుంది చంద్ర. జోకర్ల ముందు ఎవరైనా జోక్ లు వేస్తారా? అని శ్రుతి, కామాక్షిపై సెటైర్లు వేస్తుంది చంద్రకళ. అప్పుడే చంద్రకళ నడుము దగ్గర ఉన్న తాళాలను శాలిని లాక్కుని, ఇవి చూసే కదా పొగరని అంటుంది. శాలిని చేయిని వెనక్కి విరిచి చంద్ర తాళాలు తీసుకుని, ఈ ఇంట్లో నేను ఉన్నంత కాలం తాళాలు నా దగ్గరే ఉంటాయని చంద్ర వార్నింగ్ ఇస్తుంది.
శ్రుతి మరియు చంద్రకళ మధ్య గొడవ
మా బావ నీ దారిలోకి వచ్చాడనే కదా ఇలా చేస్తున్నావు. మా బావకు బుద్ధి లేదు అని శ్రుతి అనగానే చంద్ర లాగిపెట్టి చెంపపై కొడుతుంది. ఇంకోసారి మా ఆయన గురించి పిచ్చిగా వాగితే నాలుక చీరేస్తానని చంద్ర అంటుంది. కామాక్షి చేయి ఎత్తితే చంద్ర అడ్డుకుంటుంది. ఖాళీగా కూర్చుని ఏం చేయాలో తెలియక కాపురాలు కూల్చే ఆలోచన చేస్తున్నారని చంద్ర ఫైర్ అవుతుంది. తను అన్నది కరెక్ట్ ఏ కదా అని శ్యామల అంటుంది. నీ కూతురు విరాట్ ను అలా అనడం కరెక్ట్ కాదు అని కామాక్షితో శ్యామల అంటుంది.
స్పాన్సర్లను వెళ్లి కలుద్దామని శాలిని అడిగితే క్రాంతి రానని అంటాడు. ఆ మాటలు విన్న జగదీశ్వరి ఏం జరిగిందని అడుగుతుంది. శాలిని కవర్ చేస్తుంది. అయినా ఏదో గొడవ జరుగుతుందని, చెప్పండని జగదీశ్వరి అడుగుతుంది. అలాంటిదేం లేదని క్రాంతి వెళ్లిపోతాడు. ఏదైనా ఉంటే నాతో చెప్పు శాలిని అని అడిగిన జగదీశ్వరి.. మంచంపై ఉన్న నోటీసును ఏంటీ అని అడుగుతుంది. కొత్త ప్రాజెక్టు అని కవర్ చేస్తుంది శాలిని.
జగదీశ్వరి అనుమానాలు
రాత్రి ఏం చేశావని విరాట్ ను చంద్ర అడుగుతుంది. దుప్పటి కప్పానని విరాట్ అంటాడు. కానీ విరాట్ చేసిందంతా చెప్తుంది చంద్ర. నా గురించి ఆలోచిస్తున్నావు బావ. నాపై నీకు ప్రేమ ఉందని తెలుసని చంద్ర అంటుంది. తను పచ్చళ్లు అమ్మే షాప్ ను కొన్నది అర్జున్ అని తెలుసుకుంటుంది చంద్ర. రౌడీల నుంచి కాపాడాడని ఆ షాపు బాబాయికి చెప్తుంది చంద్ర. మరోవైపు శ్యామల కాళ్లు, చేతులు నొక్కుతూ కామాక్షి, శ్రుతి కాకా పడతారు. విరాట్ బావ పెళ్లి చేసుకోవాల్సింది నన్ను పెద్దమ్మ అని శ్రుతి చెప్పడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
చివరగా, ఈ ఎపిసోడ్‌లో చంద్రకళ మరియు విరాట్ మధ్య రొమాన్స్, శ్రుతితో చంద్రకళ గొడవ, జగదీశ్వరి అనుమానాలు, మరియు కొత్త ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విరాట్ ప్రేమ వ్యక్తీకరణ చూడదగినది.


