|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి జూలై 26 ఎపిసోడ్: చంద్రకళ తల్లి సుభద్ర అని తెలుసుకున్న శ్యామల- ఇంట్లోంచి వెళ్లమంటూ చంద్రపై పిన్ని ఉగ్రరూపం

Published: 25-07-2025, 8:44 PM
నిన్ను కోరి జూలై 26 ఎపిసోడ్: చంద్రకళ తల్లి సుభద్ర అని తెలుసుకున్న శ్యామల- ఇంట్లోంచి వెళ్లమంటూ చంద్రపై పిన్ని ఉగ్రరూపం

నిన్ను కోరి సీరియల్‌లోని ఈరోజు ఎపిసోడ్‌లో, చంద్రకళ తన తల్లి సుభద్రను కలుస్తుంది. ఈ విషయం శ్యామలకు తెలియడంతో ఆమె ఎలా స్పందిస్తుంది? చూద్దాం.

Key Points

1

చంద్రకళ తల్లి సుభద్రను కలుస్తుంది.

2

శ్యామల ఈ విషయం తెలుసుకుని షాక్ అవుతుంది.

4

కామాక్షి, శాలిని, శ్రుతి తమ ప్లాన్ సక్సెస్ అయిందని సంబరపడతారు.

గుడిలో తల్లి సుభద్రతో చంద్రకళ

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో తల్లి సుభద్రను కలిసిన చంద్రకళ మాట్లాడుతూ ఉంటుంది. చంద్రకళ, సుభద్ర మాట్లాడుకోవడం దుష్టత్రయం అయిన కామాక్షి , శ్రుతి, శాలిని ముగ్గురు చూస్తారు. ఎంత మంచి సీన్. ఈ సీన్‌ను శ్యామల చూస్తే కచ్చితంగా చంద్రకళకు ఉంటుంది అని అనుకుంటారు.

ఎలాగైనా చంద్రకళ, సుభద్రలను శ్యామల చూడాలని ముగ్గురు ప్లాన్ చేస్తారు. అలా చేసి శ్యామల చంద్రకళవైపు వెళ్లేలా చేస్తారు కామాక్షి, శాలిని, శ్రుతి. సుభద్రతో మాట్లాడుతున్న చంద్రకళను చూసి శ్యామల ఒక్కసారిగా ఉలిక్కిపడి షాక్ అవుతుంది. అన్నయ్యకు భద్ర శత్రువు అయిన వరదరాజులు కుటుంబంలోని మనిషితో చంద్రకళ మాట్లాడటం ఏంటీ అని ఆశ్చర్యపోతుంది.

కాస్తా దగ్గరికి వెళ్లి వాళ్ల మాటలు వింటుంది. దాంతో సుభద్ర కూతురే చంద్రకళ అని తెలిసి మరింత షాక్ అవుతుంది శ్యామల. సుభద్ర కూతురు విరాట్‌కు భార్యగా రావడం ఏంటీ, అసలు ఏంటీ ఇదంతా, చంద్రకళ ప్లాన్ ఏంటీ, ఇదంతా ఇక్కడే అడిగేద్దాం అని మొదట అనుకుంటుంది శ్యామల. కానీ, గుళ్లో అంతా ఉంటారు. ఇక్కడ వద్దు ఇంట్లోనే చంద్రకళను కడిగేస్తా అని శ్యామల వెళ్లిపోతుంది.

శ్యామలకు షాకింగ్ వార్త

శ్యామలను చూసిన కామాక్షి, శాలిని, శ్రుతి తమ ప్లాన్ సక్సెస్ అయిందని సంబరపడిపోతారు. తర్వాత సుభద్ర చంద్రకళ ఇద్దరూ తమ తమ జీవితాల గురించి చెప్పుకుంటూ బాధపడుతారు. కాసేపటి తర్వాత ఇక ఇంటికి వెళ్తానని చెప్పి చంద్రకళ అత్తింటికి బయలుదేరుతుంది. సుభద్ర కూడా తన ఇంటికి వెళ్లిపోతుంది. మరోవైపు చంద్రకళ కోసం శ్యామల ఎదురుచూస్తూ ఉంటుంది.

శ్యామల అలా ఎదురుచూడటంతో విరాట్, జగదీశ్వరి వాళ్లు వచ్చి ఏమైందని అడుగుతారు. ఇంట్లో చాలా జరుగుతున్నాయి. కాసేపయ్యాక తెలుస్తుంది అని శ్యామల అంటుంది. ఇంతలో చంద్రకళ వస్తుంది. ఎక్కడికి వెళ్లావ్. ఇప్పటివరకు ఎక్కడున్నావ్ అని చంద్రకళను శ్యామల అడుగుతుంది. దాంతో కాస్తా షాక్ అయిన శ్యామల పచ్చళ్లు అమ్మడానికి వెళ్లానని చంద్రకళ అబద్ధం చెబుతుంది.

దాంతో శ్యామల కోప్పడుతుంది. నువ్ గుడికి వెళ్లింది నేను చూశాను. నేను గుడికి వచ్చాను. అక్కడ నువ్వు సుభద్రను కలిసావు. సుభద్ర మీ అమ్మ. మీ అమ్మతో కలిసి మాట్లాడటం కూడా నేను చూశాను అని కోపంతో ఊగిపోతుంది శ్యామల. అంటే ఇన్నాళ్లు మిమ్మల్ని మోసం చేశావా అని తిడుతుంది.

శ్యామల ఉగ్రరూపం

మీ వల్ల ఈరోజు మా అన్నయ్య మంచం మీద పడ్డాడు. ఇదంతా మీ కుటుంబం వల్ల అని చంద్రకళపై మండిపడుతుంది శ్యామల. అక్కడే ఉన్న కామాక్షి, శ్రుతి, శాలిని ముగ్గురు కలిసి చంద్రకళ ఇంటికి రావడానికి కారణం మా వదినా, విరాట్ ఇద్దరే అని ఫ్లూలో అనేస్తారు.

దాంతో శ్యామలకు మరింత కోపం వస్తుంది. ఇలాంటి అమ్మాయిని కోడలిగా ఎలా తీసుకొచ్చావ్ వదినా అని జగదీశ్వరి ని నిలదీస్తుంది శ్యామల. మా అన్నయ్యను చంపాలని చూసిన కుటుంబంలోని మనిషి మా ఇంట్లో ఉండటానికి ఏమాత్రం వీళ్లేదు. ఇంట్లోంచి వెళ్లిపో అని చంద్రకళ ను గద్దిస్తుంది పిన్ని శ్యామల. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరిగా, శ్యామల కోపంతో చంద్రకళపై విరుచుకుపడుతుంది. ఆమె చంద్రకళను ఇంటి నుండి వెళ్లమని చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Tags
Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.