|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిన్ను కోరి జులై 28 ఎపిసోడ్: చంద్రకళను బయటకు గెంటేయాలన్న శ్యామల.. తాళి తెంచితేనే వెళ్తానని కండీషన్.. నెల రోజుల టైమ్

Published: 27-07-2025, 10:16 PM
నిన్ను కోరి జులై 28 ఎపిసోడ్: చంద్రకళను బయటకు గెంటేయాలన్న శ్యామల.. తాళి తెంచితేనే వెళ్తానని కండీషన్.. నెల రోజుల టైమ్

నిన్ను కోరి సీరియల్ జులై 28వ తేదీ ఎపిసోడ్ లో, చంద్రకళను ఇంటి నుండి బయటకు గెంటేయాలని శ్యామల పట్టుబడుతుంది. చంద్రకళ తన తాళి తెంచేస్తేనే వెళ్తానని చెప్పడంతో పరిస్థితి తీవ్రమవుతుంది.

Key Points

1

శ్యామల చంద్రకళను ఇంటి నుండి బయటకు గెంటేయాలని నిర్ణయించుకుంది.

2

చంద్రకళ తన తాళి తెంచేస్తేనే ఇంటి నుండి వెళ్తానని కండిషన్ పెట్టింది.

4

విరాట్ చంద్రకళ తాళి తెంచేయాలా వద్దా అనే విషయంలో ఇరుకున పడ్డాడు.

శ్యామల యొక్క కోపం

నిన్ను కోరి సీరియల్ టుడే జులై 28వ తేదీ ఎపిసోడ్ లో సుభద్ర కూతురు చంద్రకళ అని తెలుసుకున్న శ్యామల ఊగిపోతుంది. విరాట్ ద్వేషంతో తాళి కట్టడం ఏంటీ అని కామాక్షిని అడుగుతుంది. చంద్ర ముందుగా విరాట్ ఆఫీస్ లో జాయిన్ అయింది. విరాట్ చంద్రను ప్రేమించాడు. రెండు కుటుంబాలను కలపాలనే నేపథ్యంలో వరదరాజులు కుటుంబాన్ని తీసుకొచ్చింది. కానీ అన్నయ్యకు వాళ్ల పన్నాగం తెలిసిపోయింది. వదినకు నిజం చెప్పేస్తాడని అన్నయ్యకు యాక్సిడెంట్ చేయించాడు వరదరాజులు. చంద్ర ఆ నిజం దాచింది. ఆ కారణంతో విరాట్ ద్వేషించి తాళి కట్టాడని కామాక్షి క్లియర్ గా చెప్తుంది.

అదంతా నిజమే పిన్నీ. మామయ్యకు అలా జరిగిందన్న ఒక్క విషయం తప్పా మీరు ఇన్ని రోజులుగా నన్ను చూస్తున్నారు. నాలో స్వార్థం కనిపించిందా? అని శ్యామల ను అడుగుతుంది చంద్ర. నువ్వు కనిపించనివ్వలేదు. ఎంత మోసం చేశావ్. నీ కోసం మా అన్నయ్య ప్రాణాలు పోయినా పర్వాలేదనుకున్నావ్. శత్రువు కూతురు ఎప్పటికైనా శత్రువే అంటూ ఫైర్ అవుతుంది శ్యామల. శత్రువు మెడ మీద కత్తి పెట్టాలి కానీ తాళి కట్టడం ఏంట్రా అంటూ విరాట్ పై మండిపడుతుంది శ్యామల.

చంద్రకళ యొక్క నిర్ణయం

ఎవరు ఏం చెప్పినా వినకుండా దీన్ని మెడ పట్టి గెంటేయ్ అని విరాట్ కు చెప్తుంది శ్యామల. తండ్రి ప్రేమ కంటే నీకు నీ ప్రేమ ఎక్కువైందా? మా అన్నయ్యకు అలాంటి గతి పట్టిచ్చిన వాళ్లు ఈ ఇంటి చుట్టుపక్కలే ఉండకూడదని చంద్రను శ్యామల, కామాక్షి లాక్కుంటూ వెళ్తారు. బతిమాలుతున్నానని ఎక్కువ చేయకు. నన్ను గెంటేసే హక్కు దేవుడికి కూడా లేదు. ఇది నా హక్కు అంటూ మెడలో తాళి చూపిస్తూ కామాక్షిపై ఫైర్ అవుతుంది చంద్రకళ . ఇది నా ఇల్లు అని అంటుంది చంద్ర.

మీరు నన్ను వద్దనుకుంటున్నారేమో కానీ నేను మాత్రం కావాలనే అనుకుంటా. మీ ప్రేమ తల్లి ప్రేమను గుర్తు చేసింది. నిజం తెలిసిన రోజు ద్వేషిస్తారని తెలుసు. కానీ ఆ లోపే నింద చెరిపివేయాలనుకున్నా. ఒక్క అవకాశం ఇస్తే నిరూపించుకుంటానని శ్యామలను చంద్ర అడుగుతుంది. అందుకు ఒప్పుకోని శ్యామల ఇంట్లో నుంచి వెళ్లిపోమని అంటుంది. కానీ ఒక కండీషన్ నా భర్త కట్టిన తాళిని తన చేతులతోనే తీసేయమని చెప్పండని చంద్ర అంటుంది.

నెల రోజుల సవాల్

విరాట్ ను తాళి తెంచేయమని శ్యామల చెప్తుంది. విరాట్ ఆ పని చేయలేడని క్రాంతి అంటాడు. మామయ్య కోలుకునేదాకా ఇంట్లో ఉండే అవకాశం ఇవ్వండి. తప్పు లేదని నిరూపించుకుంటానని చంద్ర అంటుంది. నెలలో తప్పులేదని నిరూపించుకుంటే భార్యగా అన్ని గౌరవ మర్యాదాలు ఇస్తా. లేదంటే తాళి తెంచేస్తానని విరాట్ అంటాడు. నాకు ఓకేనని చంద్ర చెప్తుంది. ఈ నెల రోజులు శ్యామల ద్వేషం చూపిస్తానని శ్యామల వార్నింగ్ ఇస్తుంది.

ఎలా ఉంది నేను కొట్టిన దెబ్బ. నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టించా. శ్యామల పిన్నిని దగ్గరుండి గుడికి తీసుకొచ్చా. బావ నీకు టైమ్ ఇచ్చేసరికి చిన్న డిసప్పాయింట్ మెంట్ మిగిలిపోయింది. కానీ నెల రోజుల తర్వాత వెళ్లిపోతావు. నేనే గెెలవపోతున్నానని శాలిని అంటుంది. చంద్ర నవ్వుతూ.. పిన్నికి నిజం తెలిస్తే ఎలా అనే భయం పోయింది. మా ఆయన నాకు ముప్ఫై రోజుల టైమ్ ఇచ్చారంటే నేను తప్పు చేయలేదని నమ్ముతున్నట్లే. నువ్వు అనుకున్నది ఏదీ జరగనివ్వను శాలిని అని చెప్తుంది. చంద్రకళ అంతు చూస్తానని శాలిని అనుకోవడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చివరకు చంద్రకళ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నెల రోజుల సమయం పొందింది. ఈ సమయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.