
నిన్ను కోరి సీరియల్‌లో సెప్టెంబర్ 22 ఎపిసోడ్‌లో అనేక ఉత్కంఠభరిత సంఘటనలు చోటుచేసుకున్నాయి. చంద్రకళ, అర్జున్, శాలిని మరియు శ్రుతిల మధ్య జరిగిన సంఘర్షణలు ఈ ఎపిసోడ్‌లో ప్రధాన ఆకర్షణ.
Key Points
శాలిని యొక్క క్రాంతితో ఉన్న రొమాన్స్‌ను చంద్రకళ గమనిస్తుంది.
అర్జున్‌కు చంద్రకళ సహాయం చేయడం విరాట్ చూస్తాడు.
శాలిని యొక్క ప్రణాళిక ఫలిస్తుంది, శ్రుతికి గాయాలు అవుతాయి.
పచ్చళ్ళు పాడైపోవడంతో చంద్రకళ ఇబ్బందుల్లో పడుతుంది.
చంద్రకళ మరియు అర్జున్
నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో క్రాంతి తో రోజ్ ఫ్లవర్ తలలో పెట్టించుకున్న శాలిని అయ్యో.. అత్తయ్య ఇక్కడే ఉన్నారు. పో క్రాంతి అని వెళ్లిపోతుంది. మరిది గారు మీ రొమాన్స్‌ను హాల్లో కాకుండా రూమ్‌లో పెట్టుకోండి అని చంద్రకళ అంటుంది. క్రాంతి సిగ్గుపడుతూ వెళ్లిపోతాడు.
జగదీశ్వరి వెళ్లిపోతుంటే క్రాంతి, శాలిని అన్యూన్యంగా ఉంటున్నారు. అది మీరు శాలినిని క్షమించి ఒక్క అవకాశం ఇవ్వడం వల్లే. నన్ను కూడా క్షమించి అవకాశం ఇస్తే ఈ ఇల్లు మరింత ఆనందంగా మారుతుంది. క్షమిస్తారా అని అడుగుతుంది చంద్రకళ. జగదీశ్వరి ఏం మాట్లాడకుండా వెళ్లిపోతుంది. చంద్రకళకు అర్జున్ కాల్ చేసి పచ్చళ్లని పాడైపోయాయని, స్టాక్ వెనక్కి వచ్చాయని చెబుతాడు.
రీటేలియర్స్ అందరా క్వశ్చన్ చేయడానికి వస్తున్నారు. చాలా టెన్షన్‌గా ఉంది. మీరు కూడా వస్తారా అని అర్జున్ అడిగితే.. వస్తాను అని పరిగెత్తుతుంది చంద్రకళ. అది శ్యామల, విరాట్ చూస్తారు. ఇంత పొద్దున అంత కంగారుగా ఎక్కడికి వెళ్తుంది అని విరాట్ అంటే ఇంకెక్కడికి ఆఫీస్‌కు అని విరాట్‌పైనే సెటైర్లు వేస్తుంది శ్యామల. దాంతో విరాట్ తను కూడా ఆఫీస్‌కు వెళ్లాలని తప్పించుకుంటాడు.
మరోవైపు శాలిని కొట్టిన దెబ్బలకు శ్రుతికి వాతలు వస్తాయి. వెన్నుపూస పెట్టుకున్న పోలేదని, ఆయింట్‌మెంట్ రాయొచ్చుగా అని తల్లికి చెప్పుకుంటుంది. అలా కాదు నా మీద కర్రతో దెబ్బకు దెబ్బ ప్లాన్ చేశావుగా అలా చేయనా అని రివేంజ్ తీర్చుకుంటా అన్నట్లుగా మాట్లాడుతుంది కామాక్షి. కూతురు దెబ్బలతో బాధపడుతుంటే కసురుకుంటావా నువ్వు అసలు తల్లివేనా అని కోప్పడుతుంది శ్రుతి .
ఇంతలో శ్యామల వచ్చి దెబ్బల గురించి అడుగుతుంది. పిల్లి కోసం వెళ్లి గొడ మీద నుంచి పడ్డానని కవర్ చేస్తుంది శ్రుతి. కాళ్లు చేతులు విరిగితే పెళ్లి కాదని శ్యామల వెళ్లిపోతుంది. మరోవైపు శాలినికి అర్జున్ దగ్గర పనిచేసే వ్యక్తి కాల్ చేసి పికిల్స్ పాడవడం గురించి చెబుతాడు. ఊహించని దెబ్బకు చంద్రకళ కుంగిపోతుంది. దీన్ని సెన్సేషన్ చేయాలి అని మరో ప్లాన్ చెబుతుంది శాలిని.
శాలిని యొక్క ప్రణాళిక
చంద్ర నీ జీవితం మీదే దెబ్బ కొట్టబోతున్నాను. ఇంట్లోవాళ్లు నిన్ను బిజినెస్ పేరు కూడా ఎత్తనివ్వరు. ఇకపై రెక్కలు విరిగిన పక్షిలా ఓ మూలన పడి బతకాల్సిందే అని శాలిని అనుకుంటుంది. మరోవైపు అర్జున్‌ను రీటేయిలర్స్ అంతా నిలదీస్తారు. ఇంతలో చంద్రకళ వస్తుంది. తనవల్లే ఇదంతా జరిగిందని నేరం తనమీద వేసుకుంటుంది చంద్రకళ.
మీ పచ్చడి తిని నా భార్యకు ఫుడ్ పాయిజన్ అయింది. 50 వేలు ఖర్చు అయిందని కస్టమర్ అంటాడు. మీ అందరికి నష్ట పరిహారం చెల్లిస్తామని అర్జున్ అంటాడు. నా షాప్‌కు ఉన్న మంచి పేరు పోయింది. మళ్లీ పబ్లిసిటీ చేయించాలి. నాకు కూడా నష్టపరిహారం చెల్లించాలని రీటేయిలర్ అంటాడు. ఇక్కడ గోల చేయకండని చంద్రకళ అంటే.. శాలిని పురమాయించిన వ్యక్తులు దాన్ని గొడవ చేస్తారు.
ఆఫీస్‌ను ధ్వంసం చేస్తే బుద్ధి వస్తుందంటారు. కొంతమందికి అంటే కానీ అందరికి నష్టపరిహారం చెల్లించాలంటే బిజినెస్ మూసుకోవాలి అని చంద్రకళ అంటుంది. ఇలా కాదు ఆఫీస్ ముందు గొడవ చేస్తే తెలుస్తుంది అని ధర్నా చేస్తారు. మాకు నష్ట పరిహారం కావాలి అని నినాదాలు చేస్తారు. సరే అందరికి నష్ట పరిహారం చెల్లిస్తాను అని అర్జున్ అంటాడు.
కానీ, అర్జున్ దగ్గర పనిచేసే వ్యక్తి శ్రీధర్ సైగ చేయడంతో అతని మనిషి రాయితో కొడతాడు. అది అర్జున్ తలకు తగిలి రక్తం కారుతుంది. మనుషులేనా మీరు. మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మా నుంచి ఒక్క రూపాయి కూడా మీకు రాదు అని కోప్పడుతుంది చంద్రకళ. అర్జున్‌ను లోపలికి తీసుకెళ్తుంది చంద్రకళ. రాయితో ఎందుకు కొట్టావయ్యా. ఇప్పుడు తప్పు మన మీద పడింది. ఏం జరుగుతుందో ఏమో అని రీటేయిలర్ అంటాడు.
శ్రుతికి గాయాలు
ఆఫీస్‌లో అర్జున్ గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. వాళ్ల అంతు చూస్తాను అని చంద్రకళ అంటే.. వద్దు. మన ప్రొడక్ట్ ఫెయిల్ అయింది. మనదే తప్పు అని అర్జున్ అంటాడు. లేదు నేనే ఏదో మిస్ అయ్యాను తప్పంతా నాదే అని చంద్రకళ అంటుంది. మీ వల్లే ఇంత క్రేజ్ వచ్చిందని నచ్చజెప్పుతాడు అర్జున్. మరోవైపు చంద్రకళ కంగారుగా వెళ్లడం గురించి విరాట్ ఆలోచిస్తుంటాడు. కాల్ చేస్తే చంద్రకళ చూసుకోదు.
తనే చేస్తుంది అని విరాట్ అనుకుంటాడు. అర్జున్‌ను తన ఇంటికి తీసుకెళ్తుంది చంద్రకళ. ఇంట్లో పని చేసే వ్యక్తి ఏమైందని అడిగితే జరిగింది చెబుతుంది చంద్రకళ. నేను పనివాడిగా చేరి పదేళ్లు అవుతుంది. అయినా బాబాయ్ అని పిలిచి బాగా చూసుకుంటున్నారు. ఇలాంటి వాళ్లను బాధపెట్టినవాళ్లు బాగుపడరు అని బాబాయ్ అంటాడు. అర్జున్‌కు జ్వరం వస్తే డాక్టర్ గురించి అడుగుతుంది చంద్రకళ.
బాబాయ్ వెళ్లి డాక్టర్‌కు కాల్ చేస్తే వస్తాడు. ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ గాయం ఎలా తగిలిందని అడిగితే చంద్రకళ జరిగింది చెబుతుంది. గాయం లోతుగా అయింది. సెప్టిక్ కాకుండా ఇంజక్షన్ వేశాను. ఫీవర్ ఉంది. తగ్గేవరకు తడి గుడ్డతో తలపై పెట్టండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు. అర్జున్ తలకు తడిగుడ్డ పెట్టిన చంద్రకళ మందులు వేస్తూ సేవలు చేస్తుంది.
ఇంతలో బాబాయ్ కూతురుకు నొప్పులు మొదలయ్యాని చెబితే వెళ్లమని చెబుతుంది చంద్రకళ. అర్జున్ ఇంట్లోనే ఉండి రాత్రి వరకు సపర్యలు చేస్తుంది చంద్రకళ. అర్జున్‌కు జ్యూస్ తాగిస్తుంది చంద్రకళ. అది విరాట్ చూసి షాక్ అవుతాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
శాలిని యొక్క కుట్రలు చంద్రకళ జీవితంలో కష్టాలను తెచ్చిపెడతాయి. అర్జున్‌కు ఎదురయ్యే సమస్యలను చంద్రకళ ఎలా ఎదుర్కొంటుందో రానున్న ఎపిసోడ్స్ చూడాలి.


