|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నితిన్ రీఎంట్రీ ఖాయమా? సితార బ్యానర్ సినిమాతో హిట్ కొడతాడా?

Published: 30-03-2026, 7:45 AM
  • నితిన్ పుట్టినరోజు సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో కొత్త సినిమా ప్రకటన.
  • ప్రొడక్షన్ నంబర్ 43గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
  • నితిన్ గత సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో సందేహాలు.
  • ఈ సినిమాతో నితిన్ హిట్ కొడతాడా లేదా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో ఆయన కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ప్రొడక్షన్ నంబర్ 43గా రాబోతున్న ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సితార బ్యానర్‌లో నితిన్ కొత్త సినిమా ప్రకటన

Actor Nithin: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న వారిలో నితిన్ ఒకరు. నితిన్ కెరియర్ మొదట్లో పలు సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలేవి కూడా థియేటర్లో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఇలా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నారని చెప్పాలి. ఇలా నితిన్ నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ అవుతున్నప్పటికీ ఈయనకు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. వరుస సినిమాలకు కమిట్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

నితిన్ నేడు (మార్చి 30) పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈయన కొత్త సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన వెలువడింది. నితిన్ తన కొత్త సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నటించబోతున్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే సితార ఎంటర్టైన్మెంట్ నితిన్ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు.ప్రొడక్షన్‌ నంబర్ 43గా రాబోతున్న ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయబోయేది ఎవరనేది క్లారిటీ రావాల్సి ఉంది. స్టైలిష్‌ లుక్‌లో ఉన్న నితిన్‌ తాజా స్టిల్‌ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

నితిన్ ఈ లుక్ చూస్తుంటే కథ చాలా విభిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఏ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది? ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయాలన్నింటినీ కూడా చిత్ర బృందం అధికారకంగా వెల్లడించబోతున్నట్టు సమాచారం. ఇలా నితిన్ తన కొత్త సినిమాని ప్రకటించడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. నితిన్ ఈ సినిమాతో నైనా హిట్ కొట్టాలని కొందరు ఆకాంక్షించగా మరికొందరు ఈసారైనా సక్సెస్ కొడతారా? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

నితిన్ కెరీర్లో విజయాలు, అపజయాలు

Wishing the ever-energetic @actor_nithiin garu a fantastic birthday 🥳🔥

Team #ProductionNo43 Journey Begins soon. Stay tuned… big things ahead 🤗 pic.twitter.com/v36uvNlgqB

— Sithara Entertainments (@SitharaEnts) March 30, 2026

కొత్త సినిమాపై అభిమానుల అంచనాలు

నితిన్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అందుకొని చాలా కాలం అయింది. ఇటీవల ఈయన నటించిన రాబిన్హుడ్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, తమ్ముడు వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస డిజాస్టర్ లను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తదుపరి సినిమాపై అభిమానులు కూడా ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అవ్వడం నితిన్ కెరియర్ కు ఎంతో కీలకంగా మారిందని చెప్పాలి. అర్జెంటుగా సక్సెస్ కొట్టకపోతే ఇండస్ట్రీలో ఆయన కెరియర్ పూర్తిగా ఇబ్బందులలో పడుతుందని చెప్పాలి. ఇక నితిన్ చివరిగా తమ్ముడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.

నితిన్ నటించిన గత సినిమాలు నిరాశపరచడంతో, ఈ సినిమాపై ఆయన అభిమానులు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నితిన్ కెరీర్‌కు ఒక మలుపు అవుతుందో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.