
Key Points
గద్దర్ అవార్డులలో నివేదా థామస్ అనూహ్యంగా చబ్బీగా కనిపించింది.
ఈమె మార్పు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నివేదా ప్రస్తుతం ఏ సినిమాల్లోనూ నటిస్తున్నట్లు తెలియలేదు.
అనూహ్య మార్పు
ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలంటే హీరోయిన్లు.. టాలెంట్‌తో పాటు ఫిజిక్ కూడా మెంటైన్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు బ్యూటీస్ మాత్రం గ్లామర్‌ని నమ్ముకోకుండా యాక్టింగ్‌తో అలరిస్తూ ఉంటారు. నటనకు స్కోప్ ఉండే మూవీస్ చేస్తుంటారు. అలాంటి వాళ్లలో నివేదా థామస్ ఒకరు. తాజాగా గద్దర్ అవార్డుల్లో కనిపించిన ఈమె.. అందరికీ ఓ రకంగా షాకిచ్చింది. ఎందుకంటే చాలా మారిపోయింది.
సోషల్ మీడియాలో వైరల్
కేరళకు చెందిన నివేదా థామస్.. కుటుంబంతో కలిసి చెన్నైలో ఉంటుంది. బాలనటిగానే పలు సినిమాలు చేసిన నివేదా.. 2016లో వచ్చిన నాని ‘జెంటిల్‌మేన్’ మూవీత తెలుగులోకి హీరోయిన్‌గా పరిచయమైంది. అనంతరం నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచెవారెవరురా, వి, వకీల్ సాబ్ తదితర చిత్రాల్లో నటించింది. చివరగా ’35: ఇది చిన్న కథ కాదు’లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీకే ఉత్తమ నటిగా ఈమెని గద్దర్ అవార్డ్ వరించింది.
కారణం తెలియాల్సి ఉంది
తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా.. నివేదా థామస్ కూడా హాజరైంది. కానీ పూర్తిగా చబ్బీగా కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈమెని చూసి ఏంటి నివేదా ఇలా మారిపోయింది అని మాట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే నివేదా చేతిలో కొత్త సినిమాలేం లేవు. మరి నివేదా ఇంతలా మారిపోవడానికి వేరే ఏదైనా కారణముందా? అనేది తెలియాల్సి ఉంది.
నివేదా థామస్‌లోని ఈ అనూహ్య మార్పుకు కారణం ఇంకా తెలియలేదు. భవిష్యత్తులో ఆమె సినిమా ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.


