
తమిళంలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘నిజార్కుడై’ అనే ఇన్వెస్టిగేట్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు ఆహా తమిళ్ ఓటీటీలో ప్రసారం కానుంది. దేవయాని నటించిన ఈ చిత్రం IMDbలో 9.7 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
Key Points
ఆహా తమిళ ఓటీటీలో మే 30 నుండి 'నిజార్‌కుడై' స్ట్రీమింగ్.
9.7 IMDb రేటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం.
దేవయాని, విజిత్, కన్మణి మనోహరన్ నటనతో అద్భుతమైన థ్రిల్లర్.
చిన్నారి కిడ్నాప్ నేపథ్యంతో సాగే ఆసక్తికరమైన కథ.
నిజార్కుడై ఓటీటీ రిలీజ్ డేట్
తమిళ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ మూవీ నిజార్‌కుడై థియేటర్లలో విమర్శకుల ప్రశంసలను అందుకున్నది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 30 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను ఆహా ఓటీటీ అఫీషియల్ గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. మే 9న ఈ మూవీ నిజార్‌కుడై మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇరవై రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నిజార్‌కుడై మూవీలో సీనియర్ హీరోయిన్ దేవయాని లీడ్ రోల్‌లో నటించిన ఈ మూవీలో విజిత్, కన్మణి మనోహరన్, రాజ్‌కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శివ ఆర్ముణం దర్శకత్వం వహించాడు. ఓ చిన్నారి కిడ్నాప్ చుట్టూ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.
IMDb రేటింగ్ మరియు విమర్శలు
వృత్తిపరమైన బాధ్యతల్లో పడి పిల్లలను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే సందేశాన్ని ఈ మూవీలో చూపించారు. ఐఎమ్‌డీబీలో పదికిగాను నిజార్‌కుడై మూవీ 9.7 రేటింగ్ ను సొంతం చేసుకున్నది.
నిరంజన్, లాన్సీ పెద్దలను ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకుంటారు. నిరంజన్‌కు అమెరికాలో జాబ్ రావడంతో అక్కడికి వెళతారు. వారికి నీలా అనే కూతురు ఉంటుంది. మూర్చవ్యాధితో బాధపడుతోన్న నీలాకు జ్యోతి కేర్ టేకర్‌గా పనిచేయడానికి వస్తుంది. కొద్ది రోజుల్లోనే నీలా, జ్యోతి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అనుకోకుండా నీలా కిడ్నాప్ అవుతుంది.
కథ, నటీనటులు మరియు దర్శకత్వం
నీలా మిస్సింగ్‌లో తొలుత జ్యోతిని అనుమానిస్తారు? ఆ తర్వాత ఏమైంది? నీలాను కిడ్నాప్ చేసింది ఎవరు? నీలా కోసం జ్యోతి ఎలాంటి త్యాగానికి సిద్ధపడింది? శ్రీలంక శరణార్థి అయిన నీలా గతం ఏమిటి అన్నదే ఈ మూవీ కథ.
కాన్సెప్ట్ బాగున్నా కమర్షియల్‌గా మాత్రం నిజార్‌కుడై మూవీ ఆశించిన విజయాన్ని సాధించలేదు. పవన్ కళ్యాణ్ సుస్వాగతం మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది దేవయాని. శ్రీమతి వెళ్లొస్తా, మాణిక్యంతో పాటు హీరోయిన్‌గా పలు సినిమాలు చేసింది. నాని మూవీలో మహేష్‌బాబుకు తల్లిగా నటించింది. తమిళం, మలయాళం, కన్నడంతో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది.
చిన్నారి కిడ్నాప్ నేపథ్యంలో తెరకెక్కిన నిజార్కుడై, తన కథాంశం మరియు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం.



Sargun Mehta Urges People to Stop Negative Comments and Trolling Online